జాలరి పంట పండింది.. మత్స్యకారులకు చిక్కిన 26 కిలోల చేప.. ధర ఎంతంటే..

గతంలో నిజామాబాద్‌ జిల్లా అలీసాగర్ జలాశయానికి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు భారీ చేప చిక్కింది. 30 కిలోల బరువున్న బొచ్చ చేప వలకు చిక్కడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సాధారణంగా చెరువులో ఐదు నుంచి పది కిలోల వరకు బరువు ఉన్న చేపలు పెరుగుతాయి. కానీ 30 కిలోల చేప దొరకడంతో వారు సంతోషానికి అవధులు లేకుండా పోయింది. అయితే, తాజాగా

జాలరి పంట పండింది.. మత్స్యకారులకు చిక్కిన 26 కిలోల చేప.. ధర ఎంతంటే..
Huge Fish Weighing 26 Kg
Follow us

|

Updated on: May 26, 2023 | 9:57 PM

తెలంగాణ చెరువులు జలపుష్పాలతో కలకలలాడుతున్నాయి. ఏ ఊరి చెరువులో చూసిన నిండుగా చేపల పంట దర్శనమిస్తోంది. వేటకు వెళ్లిన మత్స్యకారులకు తరచూ బారీ చేపలు చిక్కటంతో జాలర్ల పంట పండుతోంది. గతంలో నిజామాబాద్‌ జిల్లా అలీసాగర్ జలాశయానికి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు భారీ చేప చిక్కింది. 30 కిలోల బరువున్న బొచ్చ చేప వలకు చిక్కడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సాధారణంగా చెరువులో ఐదు నుంచి పది కిలోల వరకు బరువు ఉన్న చేపలు పెరుగుతాయి. కానీ 30 కిలోల చేప దొరకడంతో వారు సంతోషానికి అవధులు లేకుండా పోయింది. అయితే, తాజాగా అలాంటిదే మరో మత్స్యకారుడి వలలో భారీ చేప చిక్కింది. ఈ సారి జాలరి వలలో 26 కిలోల చేప చిక్కింది.

నిజామాబాద్‌ జిల్లా డొంకేశ్వర్‌ మండలంలోని అన్నారం ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌లో మత్స్యకారుడికి 26 కిలోల భారీ చేప చిక్కింది. గురువారం జాలర్లందరూ కలిసి చేపల వేటకు వెళ్లారు. ఇందులో ప్రవీణ్‌ అనే వ్యక్తి వలకు భారీ చేప చిక్కడంతో అతడు ఆనందంతో ఎగిరిగంతేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..