ఆషాఢ బోనాలకు ముహూర్తం ఖరారు.. జూన్ 22 నుంచి అట్టహాసంగా.. జులై 9న లష్కర్​ బోనాలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారని.. మన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ సంవత్సరం బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు కేటాయించిందని మంత్రి తలసాని పేర్కొన్నారు.

ఆషాఢ బోనాలకు ముహూర్తం ఖరారు.. జూన్ 22 నుంచి అట్టహాసంగా.. జులై 9న లష్కర్​ బోనాలు
Ashada Bonalu
Follow us

|

Updated on: May 26, 2023 | 9:36 PM

ఈ ఏడాది ఆషాడ బోనాల ఉత్సవాల కోసం తెలంగాణ రాష్ట్రం సిద్ధమవుతోంది. ఉత్సవాల ఏర్పాట్లకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 కోట్లు కేటాయించింది. ఈ మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరాలను వెల్లడించారు. నగరంలో ఆషాడ బోనాల ఏర్పాట్లపై బేగంపేటలోని హరిత ప్లాజాలో బోనాల ఏర్పాట్లపై శ‌నివారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జ‌రిగింది. ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, డీజీపీ అంజనీకుమార్ పాల్గొన్నారు.. ఈ సమీక్షలో వివిధ శాఖల అధికారులు, ఆలయ కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణకు ఆషాడ మాసం బోనాలు, మహంకాళి జాతర చాలా ప్రత్యేకమని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారన్నారు.

అనంత‌రం మంత్రి మాట్లాడుతూ.. జూన్ 22న గోల్కొండలో ఆషాడ బోనాలు ప్రారంభ‌మ‌వుతాయ‌ని తెలిపారు. జులై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, 10 రంగం కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని వెల్ల‌డించారు. 16న ఓల్డ్ సిటీ బోనాలు, 17న ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో ఊరేగింపు కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని వెల్ల‌డించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారని.. మన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ సంవత్సరం బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు కేటాయించిందని మంత్రి తలసాని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..