AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టేషన్‌లో రైలు ఆపడం మర్చిపోయిన లోకో పైలట్‌..! ప్రయాణికుల గగ్గోలు.. తర్వాత సీన్‌ రివర్స్‌.. ఏం జరిగిందంటే..

మతిమరుపు అనేది అందరికీ ఉండే సర్వసాధారణ లక్షణమే. అయితే ట్రైన్ లోకో పైలట్ మరిచిపోతే ఏమవుతుంది..? అవును ఇక్కడ కూడా సరిగ్గా అదే జరిగింది. లోకో పైలట్‌ మర్చిపోవటంతో రైలు నిర్ణీత స్టాప్‌లో ఆగకుండా సుమారు 1 కి.మీ ముందుకు వెళ్లి పోయింది.

స్టేషన్‌లో రైలు ఆపడం మర్చిపోయిన లోకో పైలట్‌..! ప్రయాణికుల గగ్గోలు..  తర్వాత సీన్‌ రివర్స్‌.. ఏం జరిగిందంటే..
Passenger Train Misses Smal
Jyothi Gadda
|

Updated on: May 26, 2023 | 8:05 PM

Share

మతిమరుపు అనేది అందరికీ ఉండే సర్వసాధారణ లక్షణమే. అయితే ట్రైన్ లోకో పైలట్ మరిచిపోతే ఏమవుతుంది..? అవును ఇక్కడ కూడా సరిగ్గా అదే జరిగింది. లోకో పైలట్‌ మర్చిపోవటంతో రైలు నిర్ణీత స్టాప్‌లో ఆగకుండా సుమారు 1 కి.మీ ముందుకు వెళ్లి తిరిగి వచ్చి ప్రయాణికులను తీసుకెళ్లింది. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. కేరళలోని ఓ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణికులను ఎక్కించుకునేందుకు దాదాపు 700 మీటర్లు వెనక్కి ప్రయాణించింది. కేరళలోని అలప్పుజా జిల్లా నుండి షోర్నూర్ వెళ్తున్న వేనాడ్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ చేర్యానాడ్ రైల్వే స్టేషన్‌లో ఆగకుండా ముందుకు వెళ్ళటంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. చెరియనాడ్ రైల్వేస్టేషన్‌లో సిగ్నల్ లేకపోవడంతో ఈ సమస్య ఏర్పడిందని రైల్వే అధికారులు తెలిపారు.

చెరియనాడు హాల్ట్ స్టేషన్ కావడంతో ఇక్కడ సిగ్నల్ ఏర్పాటు చేయలేదని.. షెడ్యూల్డ్ స్టేషన్‌లో ఆగని లోకో పైలట్ ( రైల్వే స్టేషన్) రైలు ఎక్కేందుకు వేచి ఉన్న ప్రయాణికులను తీసుకెళ్లేందుకు రైలును దాదాపు 700 మీటర్ల దూరం వెనక్కి నడిపించారు. సోమవారం ఉదయం 7:45 గంటల ప్రాంతంలో ట్రైన్‌ రివర్స్‌లో నడిచింది. నివేదికల ప్రకారం, చేర్యానాడ్ రైల్వే స్టేషన్‌లో దిగాల్సిన, ఎక్కాల్సిన ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. కాగా,  ఇది డి- మావేలికర్ర, చెంగనూర్ స్టేషన్ల మధ్య ఉన్న గ్రేడ్ స్టేషన్ సమస్య గురించి ఎవరూ ఫిర్యాదు చేయలేదు.

అయితే, కొన్నేళ్ల క్రితం ఉత్తరాఖండ్‌లో జన్‌శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు కూడా 20 కిలోమీటర్లకు పైగా వెనుకకు పరుగెత్తినప్పుడు ఇలాంటి సంఘటన జరిగింది. ప్రెజర్ పైపు లీకేజీ కారణంగా రైలు బ్రేకులు ఫెయిలయ్యాయని, పైలట్‌లు ఆపలేకపోయారని, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారని సమాచారం.

ఇవి కూడా చదవండి

అయితే, భారతీయ రైల్వే అనేది మొత్తం ఆసియాలోనే అతిపెద్ద రైలు నెట్‌వర్క్. ప్రపంచంలోనే అతిపెద్ద రైలు నెట్‌వర్క్. విశాలమైన సంస్థ చాలా వ్యవస్థీకృత వ్యవస్థను కలిగి ఉంది. ఇలాంటి సంఘటనలు ఒక్కోసారి జరుగుతుంటాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..