Viral Video: ఎర్రటి ఎండకు స్పృహ తప్పిపడిపోయిన పిచ్చుక.. అటుగా వచ్చిన బాటసారి ఏం చేశాడో తెలుసా..?
ఈ కాంక్రీట్ జంగిల్‌లో నోరులేని మూగజీవాలకు నిలువ నీడలేదు. దాహం తీర్చుకునేందుకు కూడా చుక్క నీరు దొరకని స్థితిలో కొన్ని జంతువులు, పక్షులు నీరసించి ఎక్కడికక్కడే కుప్పకూలిపోతున్నాయి. మండుటెండలో పక్షుల కోసం తమ బాల్కనీలో గింజలు, నీళ్లు పెట్టేవారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు అది చాలా అరుదుగా కనిపిస్తుంది.
ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి భగభగలకు మనుషులే కాదు, పశుపక్షాదులు సైతం మలమలా మాడిపోతున్నాయి. మనుషులకు ఎండవేడి నుంచి తప్పించుకోవటానికి అనేక మార్గాలున్నాయి. కానీ, ఈ కాంక్రీట్ జంగిల్‌లో నోరులేని మూగజీవాలకు నిలువ నీడలేదు. దాహం తీర్చుకునేందుకు కూడా చుక్క నీరు దొరకని స్థితిలో కొన్ని జంతువులు, పక్షులు నీరసించి ఎక్కడికక్కడే కుప్పకూలిపోతున్నాయి. మండుటెండలో పక్షుల కోసం తమ బాల్కనీలో గింజలు, నీళ్లు పెట్టేవారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు అది చాలా అరుదుగా కనిపిస్తుంది. ఎండలో ఆకలితో, దాహంతో ఆహారం లేక నీరు వెతుక్కుంటూ మైళ్ల దూరం వెళ్తున్న పక్షులు మండుటెండలో మాడిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
ఎర్రటి ఎండలో ఒక పక్షి నేలకూలింది. దాహంతో ఆ పక్షి కళ్లు కూడా తెరవలేని స్థితిలో ఉంది. మీద నుంచి ఎండవేడి, కింద ఇసుక నేలపై పడివున్న పక్షి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోందది. ఇటువంటి పరిస్థితిలో ఒక బాటసారి ఆ పక్షిని చూసి చలించిపోయాడు. వెంటనే ఆ పక్షి దగ్గరకు వెళ్లాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన వెంట తెచ్చుకున్న సీసాలో నీటిని ఆ పక్షికి పట్టించాడు. ఒక్కసారి నీళ్ళు నోట్లోకి వెళ్ళగానే ఆ చిన్ని ప్రాణి లేచి కూర్చుంది. ఇంకా అతడు అలాగే ఆ పక్షి బాటిల్ ద్వారా కావాల్సినన్ని నీళ్లు తాగించి దాని దాహం తీర్చాడు. పక్షి వేగంగా నీళ్ళు తాగడం ప్రారంభించింది. దాని గొంతులో తడి తగిలిన వెంటనే ఆ పక్షిలో పూర్వపు శక్తి, ఉత్సాహం కనిపించింది. ఈ వైరల్ వీడియోని ‘ది ఫిగెన్’ (@TheFigen_ అనే ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేయగా, ప్రస్తుతం వైరల్‌గా మారింది. వీడియో క్యాప్షన్‌లో ఒక జీవికి జీవితాన్ని ఇవ్వడం అమూల్యమైనదిగా పేర్కొన్నారు.
Giving life to a living thing is priceless…pic.twitter.com/yWXSeRkkuO
— Figen (@TheFigen_) May 25, 2023
రోడ్డుపై ఉన్న పక్షికి ఓ వ్యక్తి నీళ్లు తాగిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ బాటసారి దయ హృదయాన్ని ప్రజలు అభినందిస్తున్నారు. ప్రతి జీవితం విలువైనదేనంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. ఆ వ్యక్తి సకాలంలో పిచ్చుకకు సహాయం చేయకపోతే, దాని ప్రాణాలకే ముప్పు వాటిల్లేది అంటూ మరికొందరు వాపోయారు. కాబట్టి, మండుతున్న ఎండల్లో మన చుట్టూ ఉన్న జంతువులు, పక్షులకు సహాయం చేయండి. వీలైతే వాటికి ఆహారం, నీళ్ల ఏర్పాట్లు చేయండి. ఇది మన చుట్టూ ఉన్న మూగజీవాలకు మనం చేసే సహాయం అవుతుంది.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..