AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేక్ తర్వాత వర్కవుట్ ఎందుకు కష్టంగా అనిపిస్తుందో తెలుసా? సోహా అలీ ఖాన్ ఫిట్‌నెస్‌ టిప్స్

ఒక అద్భుతమైన ట్రిప్ వెళ్లి వచ్చిన తర్వాత మనసు ఉత్సాహంగా ఉన్నా, శరీరం మాత్రం సహకరించదు. ముఖ్యంగా రెగ్యులర్ గా వ్యాయామం చేసేవారికి బ్రేక్ తర్వాత మళ్ళీ జిమ్ లో అడుగుపెట్టడం ఒక పెద్ద సవాలు. 47 ఏళ్ల వయసులోనూ అదిరిపోయే ఫిట్‌నెస్‌తో కనిపించే ఆ నటి కూడా ఇందుకు మినహాయింపు కాదు.

బ్రేక్ తర్వాత వర్కవుట్ ఎందుకు కష్టంగా అనిపిస్తుందో తెలుసా? సోహా అలీ ఖాన్ ఫిట్‌నెస్‌ టిప్స్
Soha Ali Khan (2)
Nikhil
|

Updated on: Feb 22, 2026 | 6:20 AM

Share

జపాన్ వెకేషన్ తర్వాత ఆమె తన మొదటి వర్కవుట్‌గా ‘సర్క్యూట్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్’ను ఎంచుకున్నారు. బాడీలోని ప్రధాన కండరాలను మేల్కొల్పడానికి, జెట్ లాగ్ నుండి బయటపడటానికి ఇది ఉత్తమ మార్గమని ఆమె చెబుతున్నారు. ఆ ఫిట్‌నెస్ ఫ్రీక్ మరెవరో కాదు.. సోహా అలీ ఖాన్.

వెకేషన్ లేదా లాంగ్ బ్రేక్ తర్వాత తిరిగి వర్కవుట్ మొదలుపెట్టడం అనేది కొండను ఎక్కడం కంటే కష్టంగా అనిపిస్తుంది. శరీరంలో మునుపటి శక్తి లేనట్లు, అడుగు తీసి అడుగు వేయలేనట్లు ఒక రకమైన నీరసం ఆవహిస్తుంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు నటి సోహా అలీ ఖాన్. జపాన్ పర్యటన ముగించుకుని వచ్చిన ఆమె, తన మొదటి జిమ్ సెషన్‌కు సంబంధించిన విశేషాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. బ్రేక్ తర్వాత వర్కవుట్ ఎందుకు కష్టమవుతుంది, దానిని ఎలా అధిగమించాలో ఈ స్టార్​ బ్యూటీ చెప్పుకొచ్చింది.

  • విహారయాత్రలో ఉన్నప్పుడు మన ఆహారపు అలవాట్లు, నిద్ర సమయాలు, శారీరక శ్రమ అన్నీ మారిపోతాయి. ఫిట్‌నెస్ నిపుణురాలు గరిమా గోయల్ ప్రకారం, బ్రేక్ తీసుకున్నప్పుడు కండరాల బలం, గుండె సామర్థ్యం, నరాల సమన్వయం లో స్వల్ప మార్పులు వస్తాయి.
  • నిరంతరం శ్రమకు గురయ్యే కండర తంతువులు విశ్రాంతి సమయంలో తమ పనితీరును తాత్కాలికంగా తగ్గిస్తాయి.
  • హృదయనాళ వ్యవస్థ మునుపటి తీవ్రతకు అలవాటు పడటానికి సమయం తీసుకుంటుంది. అందుకే మొదటి రోజు వర్కవుట్ చేసేటప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది, త్వరగా అలసట వచ్చేస్తుంది.

మానసిక ఆందోళన..

మనం బ్రేక్ తీసుకోకముందు ఎంత బరువులు ఎత్తామో, ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తామో అదే స్థాయిలో మళ్ళీ చేయాలని ఆశిస్తాం. కానీ వాస్తవం దానికి భిన్నంగా ఉంటుంది. ఈ అంచనాలకు, వాస్తవానికి మధ్య ఉన్న వ్యత్యాసం వల్ల వర్కవుట్ మరీ కష్టంగా అనిపిస్తుంది. ఇది కేవలం మనసు సృష్టించే భ్రమ మాత్రమేనని, శరీరం మళ్ళీ సర్దుబాటు చేసుకోవడానికి సమయం పడుతుందని గుర్తించాలి.

మొదటి రోజే కఠినమైన వ్యాయామాలు చేయకుండా తక్కువ తీవ్రతతో మొదలుపెట్టాలి. సోహా అలీ ఖాన్ లాగా సర్క్యూట్ ట్రైనింగ్ చేయడం వల్ల అన్ని కండరాలకు కదలిక లభిస్తుంది. క్రమం తప్పకుండా ప్రయత్నిస్తే వారం పది రోజుల్లోనే గుండె స్పందనలు స్థిరపడతాయి, కండరాలకు మళ్ళీ పట్టు వస్తుంది. ఇది కేవలం ఒక తాత్కాలిక దశ మాత్రమే. బ్రేక్ తర్వాత కష్టం అనిపించడం సహజం. దీనిని ఒక అడ్డంకిలా కాకుండా, కొత్త ప్రారంభంగా భావించాలి. జీవితంలో వెకేషన్లు ఎంత ముఖ్యమో, తిరిగి ఆరోగ్యకరమైన జీవనశైలిలోకి రావడం కూడా అంతే ముఖ్యం. సోహా అలీ ఖాన్ చెప్పినట్లు మొదటి అడుగు వేయడమే కష్టం, ఆ తర్వాత అంతా సులభమే.

Follow Us