AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఇట్స్ అఫీషియల్.. 20 రోజులకే ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీలో 7.9 రేటింగ్ సినిమా

ఫిబ్రవరి 06న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ టాకే వచ్చింది. కథ, కథనాల పరంగా ప్రశంసలు అందాయి. ఆడియెన్స్ ను బాగానే భయపెట్టిన ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి. అయితే లాంగ్ రన్ లో మాత్రం ఈ మూవీ నిరాశ పర్చింది.

OTT Movie: ఇట్స్ అఫీషియల్.. 20 రోజులకే ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీలో 7.9 రేటింగ్ సినిమా
OTT Movie
Basha Shek
|

Updated on: Feb 22, 2026 | 6:47 AM

Share

ప్రజెంట్ మూవీ ట్రెండ్ ఏదంటే హారర్ థ్రిల్లర్ సినిమాలే అని చెప్పవచ్చు. భాషతో సంబంధం లేకుండా ఈ జానర్ సినిమాలను చూసేస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఆడియెన్స్ కోసమే మరో హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర ఈ మధ్యన ఎక్కువగా హారర్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీసులతోనే ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడు. 28 డిగ్రీ సెల్సియస్, లెవెన్, షో టైమ్, బ్లైండ్ స్పాట్ తదితర సినిమాలు ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. లేటెస్ట్ గా నవీన్ చంద్ర నటించిన మరో హారర్ థ్రిల్లర్ హనీ. పిల్లి మాయ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 06న థియేటర్లలోవిడుదలైంది. అయితే యావరేజ్ రిజల్ట్ తో మాత్రమే సరిపెట్టుకుంది. కథ, కథనాలు, బ్యాగ్రౌండ్ స్కోర్, క్లైమాక్స్ ఎపిసోడ్ బాగానే ఉన్నా మితిమీరిన వయొలెన్స్, కాస్త గందరగోళంగా అనిపించే సన్నివేశాలు ఈ సినిమాకు మైనస్ గా మారాయి. దీంతో ఈ సినిమా థియేటర్లలో లాంగ్ రన్ కొనసాగించలేకపోయింది. అయితే ఐఎండీబీలో ఈ మూవీకి 7.9 రేటింగ్ రావడం గమనార్హం.

థియేటర్లలో ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందజేసిన హనీ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్ట్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 27 నుంచి నవీన్ చంద్ర సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు సన్ నెక్ట్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ మూవీ అందుబాటులోకి రానుంది.

ఇవి కూడా చదవండి

సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్..

హనీ సినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. దివ్య పిళ్లై, దివి వాద్త్యా, రాజా రవీంద్ర, బేబీ జయన్ని తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అజయ్ ఆర్ సదా సంగీతం అందించారు. ఈ మధ్యన థియేటర్లలో ఆడని సినిమాలు, మరీ ముఖ్యంగా హారర్ థ్రిల్లర్ మూవీస్ ఈ మధ్యన ఓటీటీలో ఎక్కువగా ఆదరణ పొందుతున్నాయి. దీంతో హానీ మూవీ విషయంలోనూ ఇదే జరుగుతుందని మేకర్స్ భావిస్తున్నారు.

హనీ సినిమా లో నవీన్ చంద్ర..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us