Watch: 45ఏళ్ల కోటీశ్వరుడు.. యవ్వనంగా కనిపించడానికి మూడు తరాల రక్తంతో చికిత్స.. ఏడాది ఖర్చు ఏంతంటే..

జాన్సన్ తండ్రి నుంచి కూడా రక్తాన్ని సేకరించారు. పైన చేసిన అదే ప్రక్రియను పునరావృతం చేశారు. మొత్తం మీద ఈ ఖరీదైన చికిత్సలో భాగంగా మూడు తరాల మధ్య రక్త మార్పిడి జరిగింది. కేవలం రెండేళ్లలో జాన్సన్ తన వృద్ధాప్యాన్ని కంట్రోల్‌ చేస్తూ.. తన వయసును ఐదు సంవత్సరాలకు పైగా తగ్గించుకున్నాడని వైద్యులు పేర్కొన్నారు.

Watch: 45ఏళ్ల కోటీశ్వరుడు.. యవ్వనంగా కనిపించడానికి మూడు తరాల రక్తంతో చికిత్స.. ఏడాది ఖర్చు ఏంతంటే..
Plasma Swapping
Follow us

|

Updated on: May 26, 2023 | 4:17 PM

డిజిటల్ డి-ఏజింగ్ అనేది చాలా సినిమాల్లో కనిపించే విషయం. సినిమాలో హీరో అందరీ కంటే యవ్వనంగా కనిపించేలా చేయడానికి ప్రత్యేక ప్రభావాలను ఉపయోగిస్తారు. దాంతో పెద్ద వయసు వారు కూడా యవ్వనంగా, యంగ్‌గా కనిపిస్తుంటారు. అయితే, నిజ జీవితంలో కూడా వృద్ధాప్యాన్ని ఎవరూ ఇష్టపడరు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ యవ్వనంగా కనిపించాలనే కోరుకుంటారు. అందుకోసం రక రకాల కాస్మోటిక్ ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్లో అలాంటి అనేక ఉత్పత్తులు, సౌందర్య చికిత్సలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చేశాయి. అలాంటిదే ఈ సంఘటన కూడా. అమెరికాలోని ఒక కోటీశ్వరుడు ప్లాస్మా మార్పిడి ద్వారా మీదపడుతున్న తన వయసును ఆపేందుకు ట్రై చేస్తున్నాడు. అవును, 45 ఏళ్ల బ్రియాన్ జాన్సన్ తనను తాను యవ్వనంగా ఉంచుకోవడానికి ప్లాస్మా చికిత్స తీసుకుంటున్నాడు. ఈ చికిత్స కోసం ప్రతి సంవత్సరం 2 లక్షల డాలర్లు అంటే ఏడాదికి దాదాపుగా 16 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాడు! అయితే ఈ ప్లాస్మా చికిత్స కోసం అతనికి తన కొడుకు తాల్మేజ్, తండ్రి రిచర్డ్ లీటర్ల కొద్దీ రక్తం దానం చేయాల్సి వచ్చింది.

కాలిఫోర్నియాలో నివసించే బ్రియాన్ జాన్సన్ ఓ కంపెనీ యజమాని. తనను తాను ఫిట్‌గా ఉంచుకోవడానికి చాలా కఠినమైన రొటీన్‌ని అనుసరిస్తాడు. సంపూర్ణ ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు, వ్యాయామం, నిద్రవేళలు అన్ని క్రమం తప్పకుండా పాటిస్తాడు. అంతేకాదు..జాన్సన్‌ తన వయసును తగ్గించుకోవటం కోసం ప్రతి సంవత్సరం అతను 2 మిలియన్ డాలర్లకు పైగా అంటే సుమారు 16 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాడు..జాన్సన్‌ తన వయస్సును తగ్గించడానికి, తిరిగి యవ్వనంగా కనిపించటానికి అతను ‘ప్రాజెక్ట్ బ్లూప్రింట్’ అనే యాంటీ ఏజింగ్ ప్రక్రియను ప్రారంభించాడు. దీని లక్ష్యం 70ఏళ్లలో శరీర భాగాల జీవసంబంధమైన వయస్సును తగ్గించడం.

ఇవి కూడా చదవండి

నివేదిక ప్రకారం, జాన్సన్ తన ఏజ్‌ని తగ్గించుకోవటం కోసం 70 ఏళ్ల తండ్రి, 17 ఏళ్ల కొడుకు టాల్మేజ్‌తో కలిసి USAలోని టెక్సాస్‌లోని ఒక క్లినిక్‌కి వెళ్లాడు. అక్కడ మొదట అతని కొడుకు ఒక లీటరు రక్తం ఇచ్చాడు. దాని నుండి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్లు, ద్రవ ప్లాస్మా వంటి రక్త భాగాలు వేరు చేశారు. ప్లాస్మా చికిత్స కోసం జాన్సన్‌ సొంత రక్తాన్ని కూడా సేకరించారు. ఆ తర్వాత కొడుకు రక్తాన్ని జాన్సన్ సిరల్లోకి ఎక్కించారు. జాన్సన్ తండ్రి నుంచి రక్తాన్ని సేకరించారు. పైన చేసిన అదే ప్రక్రియను పునరావృతం చేశారు. మొత్తం మీద ఈ ఖరీదైన చికిత్సలో భాగంగా మూడు తరాల మధ్య రక్త మార్పిడి జరిగింది. కేవలం రెండేళ్లలో జాన్సన్ తన వృద్ధాప్యాన్ని కంట్రోల్‌ చేస్తూ.. తన వయసును ఐదు సంవత్సరాలకు పైగా తగ్గించుకున్నాడని వైద్యులు పేర్కొన్నారు. అతనికి ఇప్పుడు 37 ఏళ్ల వ్యక్తి గుండె, 28 ఏళ్ల వ్యక్తి చర్మం ఏర్పడినట్టుగా వైద్యులు వెల్లడించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు