AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు హల్ చల్.. ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటున్న ప్రజలు…

పగటిపూటే పంట పొలాలపై పడి దాడి చేశాయి. దాంతో.. స్థానికులు, రైతులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎలాగైనా ఏనుగులను తరిమేయాలని భావించి బాణాసంచా పేల్చగా తిరగబడ్డాయి. పెద్దయెత్తున ఘీంకరిస్తూ జనం మీదకు దూసుకురావడంతో పరుగులు తీశారు.

చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు హల్ చల్.. ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటున్న ప్రజలు...
Elephants
Follow us
Jyothi Gadda

|

Updated on: May 25, 2023 | 9:54 PM

చిత్తూరు జిల్లాను ఏనుగులు హడలెత్తిస్తున్నాయి. పక్క రాష్ట్రాల నుంచి గుంపులుగుంపులుగా వస్తున్న ఏనుగులు ఏపీ సరిహద్దు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా సంచరిస్తున్న ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరుస ఘటనలతో ప్రజలను వణికిస్తున్నాయి. గత నెల రోజుల్లో తమిళనాడు, ఏపీలో పదిమందికిపైగా ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంటో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో.. అటవీశాఖ సిబ్బంది అప్రమత్తమై రెండు ఏనుగులను ఎట్టకేలకు బంధించి.. తమిళనాడులోని ఓ అభయారణ్యానికి తరలించారు.

అయితే.. హమ్మయ్యా.. అని చిత్తూరు ప్రజలు ఊపిరి పీల్చుకునేలోపే.. తమిళనాడు నుంచి మరోసారి 14 ఏనుగుల గుంపు వచ్చి పడింది. వి.కోట మండలం తోటకనుమ పరిసరాల్లో ఆ ఏనుగుల గుంపు తిష్ట వేసింది. పగటిపూటే పంట పొలాలపై పడి దాడి చేశాయి. దాంతో.. స్థానికులు, రైతులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎలాగైనా ఏనుగులను తరిమేయాలని భావించి బాణాసంచా పేల్చగా తిరగబడ్డాయి. పెద్దయెత్తున ఘీంకరిస్తూ జనం మీదకు దూసుకురావడంతో పరుగులు తీశారు.

ఇక.. గజరాజుల ఘీంకారాలతో ఆయా గ్రామాల ప్రజలు భయం గుప్పెట్లో బతుకుతున్నారు. ఇక.. ఏనుగుల గుంపు బీభత్సంపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు.. వీ.కోట మండలం బైరెడ్డిపల్లి మండలం కైగల్ అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు వచ్చినట్లు గుర్తించారు. అనిమల్ ట్రాకర్స్‌ సాయంతో ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలోకి మళ్లించే ప్రయత్నం చేశారు. అయితే.. బైరెడ్డిపల్లి, పలమనేరు మండలం అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఫారెస్ట్‌ అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..