Health Tips: ఎండాకాలంలో ఈ పండు సంజీవని.. ఆరోగ్యంతో పాటు అందానికి కూడా దివ్యౌషధం..

ఎందుకంటే ఈ పండ్లలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఫైబర్ అధికంగా ఉండే డ్రాగన్ ఫ్రూట్ జీవక్రియను పెంచుతుంది. వేగంగా బరువు తగ్గటానికి దోహదపడుతుంది.

Health Tips: ఎండాకాలంలో ఈ పండు సంజీవని.. ఆరోగ్యంతో పాటు అందానికి కూడా దివ్యౌషధం..
Follow us
Jyothi Gadda

|

Updated on: May 25, 2023 | 9:18 PM

డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలుచేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అధిక బరువును తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. దీన్ని రెగ్యులర్ గా తింటే పలు రకాల రోగాలను కూడా నయం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాట. బరువు తగ్గించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నవారు డైట్‌లో డ్రాగన్ ఫ్రూట్‌ని చేర్చుకోవటం వల్ల మంచి మేలుకలుగుతుంది. ఎందుకంటే ఈ పండ్లలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఫైబర్ అధికంగా ఉండే డ్రాగన్ ఫ్రూట్ జీవక్రియను పెంచుతుంది. వేగంగా బరువు తగ్గటానికి దోహదపడుతుంది.

అంతేకాదు..డ్రాగన్‌ ఫ్రూట్‌ చర్మానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో విటమిన్ సి సన్‌బర్న్‌ని తగ్గిస్తుంది. కాలిన ప్రదేశంలో ఇన్‌ఫెక్షన్ రాకుండా చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి..డ్రాగన్ ఫ్రూట్ వాపును నివారిస్తుంది. మీరు కీళ్లనొప్పుల కారణంగా దీర్ఘకాలిక నొప్పితో బాధపడుతున్నవారికి డ్రాగన్ ఫ్రూట్‌ మంచిది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్లు, కండరాలలో తీవ్రమైన నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. డ్రాగన్ ఫ్రూట్‌లోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరిస్తాయి. వాపును తగ్గిస్తాయి.

గర్భధారణ సమయంలో రక్తహీనతను నయం చేయడంలో సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో తక్కువ హిమోగ్లోబిన్ శిశు మరణాలు, తక్కువ బరువు, గర్భస్రావం వంటి సమస్యలను నివారిస్తుంది. వాస్తవానికి, గర్భధారణ సమయంలో మహిళలు రక్తహీనత ప్రమాదానికి గురవుతారు. ఇది ఐరన్‌ లోపం వల్ల వస్తుంది. రక్తహీనత యొక్క లోపాన్ని అధిగమించడానికి వైద్యులు మందులు వాడమని సూచిస్తు్ంటారు. అయితే మీరు ఆ మందులతో ఆపాటుగా డ్రాగన్ ఫ్రూట్‌ని కూడా తీసుకోవటం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?