AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janasena: వైసీపీ పాలనలో అటకెక్కిన పోలవరం.. కథాకళి-2 పేరుతో వీడియో రిలీజ్.. దుబాయ్ పర్యటనలో నాగబాబు బిజీబిజీ

పోలవరం ప్రాజెక్టును అటకెక్కించారని విమర్శించారు. దీనికి సంబంధించి 'కథాకళి-2' పేరిట ఆయన ప్రత్యేక వీడియో విడుదల చేశారు. అటు.. దుబాయ్‌లో నాగబాబుకు జనసైనికులు ఘనస్వాగతం పలికారు.

Janasena: వైసీపీ పాలనలో అటకెక్కిన పోలవరం.. కథాకళి-2 పేరుతో వీడియో రిలీజ్.. దుబాయ్ పర్యటనలో నాగబాబు బిజీబిజీ
Nagababau At Dubai
Surya Kala
|

Updated on: May 26, 2023 | 6:37 AM

Share

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి ఓ రేంజ్ లో సాగుతుంది. అధికార వైసీపీ నేతల.. జనసేన నేతల నువ్వు ఒకటి అంటే నేను రెండు అంటా అంటూ ఒకరిపై ఒకరు విమర్శల దాడి చేసుకుంటున్నారు. తాజాగా ఏపీలోని    వైసీపీ పాలనపై  జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణదెల నాగబాబు స్పందించారు. పోలవరం ప్రాజెక్టును అటకెక్కించారని విమర్శించారు. దీనికి సంబంధించి ‘కథాకళి-2’ పేరిట ఆయన ప్రత్యేక వీడియో విడుదల చేశారు. అటు.. దుబాయ్‌లో నాగబాబుకు జనసైనికులు ఘనస్వాగతం పలికారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాగు, తాగునీటితో పాటు వేల కోట్ల ఆదాయ వనరులను అందించే అక్షయ పాత్ర వంటి పోలవరం ప్రాజెక్టుని ప్రభుత్వం గాలికి వదిలేసిందని నాగబాబు విమర్శించారు. జనసేన పార్టీ అధికార ప్రతినిధి వేములపాటి అజయకుమార్ మధ్య జరిగిన సంభాషణతో వీడియో విడుదల చేశారు నాగబాబు. ఈ సందర్భంగా.. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా ఏపీ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో పోలవరం పనులు జరగవని, ఆగిపోయినట్టేనని, చాలా బాధగా ఉందని అన్నారు. పోలవరం పూర్తైతే మూడు పంటలు పండుతాయని, లక్ష కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని.. కానీ ఇప్పుడు పూర్తైయ్యే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీతి, నిజాయితీ, రైతులు పట్ల ప్రేమ ఉన్న నాయకుడు పవన్ కల్యాణ్ నాయకత్వంలో పోలవరం కడతారని, ప్రజలు ఆనదంగా ఉంటారని వేములపాటి అజయ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.

ఇక మరోవైపు.. మూడు రోజుల పర్యటనలో భాగంగా దుబాయ్ వెళ్లారు నాగబాబు. దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌లో నాగబాబుకి ఘనస్వాగతం లభించింది. దుబాయ్‌ పర్యటనలో భాగంగా.. నేటి నుండి 28 వరకు దుబాయ్ వేదికగా జరగనున్న సమావేశాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఒమాన్, ఖతార్, బహ్రెయిన్ దేశాల్లో స్థిరపడిన జన సైనికులు, వీర మహిళలు ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. ఈ క్రమంలోనే.. కథాకళి-2 పేరుతో ప్రత్యేక వీడియోను విడుదల చేశారు నాగబాబు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!