Horoscope Today: వారికి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం..12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (February 22, 2026): మేష రాశి వారు ఆర్థికంగా ఇతరులను ఆదుకునే స్థితిలో ఉంటారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృషభ రాశి వారు సకాలంలో బాధ్యతలు పూర్తి చేయగలుగుతారు. అధికారులతో సామరస్యంగా వ్యవహరించడం మంచిది. మిథున రాశి వారి ఆదాయ వృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

దిన ఫలాలు (ఫిబ్రవరి 22, 2026): మేష రాశి వారికి ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృషభ రాశి వారు అధికారులతో సామరస్యంగా వ్యవహరించడం మంచిది. మిథున రాశి వారు సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, ఉద్యోగాలలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆర్థికంగా ఇతరులను ఆదుకునే స్థితిలో ఉంటారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు, వివాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. పిల్లలు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభాలతో పురోగమిస్తాయి. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి, శ్రమ ఉన్నప్పటికీ, సకాలంలో బాధ్యతలు పూర్తి చేయగలుగుతారు. అధికారులతో సామరస్యంగా వ్యవహరించడం మంచిది. వ్యాపారంలో కొద్దిపాటి లాభాలకు మాత్రమే అవకాశం ఉంది. తలపెట్టిన వ్యవహారాల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి. ఆదాయ ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. నిరుద్యోగులు ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాలలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఆదాయ వృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు దూసుకుపోతారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. స్తోమతకు మించి ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో సహచరుల బాధ్యతలను కూడా పంచుకోవడం జరుగుతుంది. అధికారుల గుర్తింపు లభిస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహం కలిగిస్తాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాల్లో నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొందరు మిత్రుల సహాయంతో నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకుంటారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. జీవిత భాగస్వామితో ఒకటి రెండు సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత జీవితంలో కూడా ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రేమ వ్యవహారాలలో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో ప్రశాంత, సామరస్య వాతావరణం నెలకొంటుంది. కొందరు బంధుమిత్రుల నుంచి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల వాతావరణం నెలకొని ఉంది. వీటిపై శ్రద్ధను పెంచడం మంచిది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆదాయంతో పోటీగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ప్రముఖుల నుంచి ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. గృహ, వాహనాల కొనుగోలు మీద దృష్టి సారిస్తారు. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాల విస్తరణ గురించి ఆలోచనలు సాగిస్తారు. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడతారు. బంధుమిత్రులతో సాన్నిహిత్యం మరింతగా పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం, ఇతరులతో వాదనలకు దిగకపోవడం మంచిది. కొత్త ప్రయత్నాలు, కొత్త కార్యాలు సఫలం అవుతాయి. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికపరంగా అనుకూలత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది. చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఎవరికైనా వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం కానీ చేయవద్దు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆశించిన శుభవార్త అందుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
కొంత వ్యయ ప్రయాసలకు అవకాశం ఉన్నప్పటికీ, ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకుం టారు. ఆస్తి వివాదానికి సంబంధించి సోదరులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కుటుంబ విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరిగినప్పటికీ, ఆశించిన ప్రతిఫలం చేతికి అందుతుంది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో బాగా ఆలస్యానికి అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. తోబుట్టువులు, బంధువులతో ఆస్తి వివాదానికి సంబంధించి ఒక సానుకూలమైన శుభవార్త వింటారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. ఆదాయానికి లోటుండదు. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. చిన్ననాటి మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరి చయాలు పెంపొందుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. ప్రేమ వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి.