మచ్చలేని చర్మం, అందంగా మెరిసే జుట్టు కోసం.. చెరుకు రసం.. ఇంకా బోలెడన్నీ ప్రయోజనాలు..

చెరుకు రసం మీరు యవ్వనంగా, అందంగా కనిపించేలా చేస్తుంది. మీ స్కిన్ రంగును కూడా మెరుగుపరుస్తుంది. శరీరంపై మృతకణాలను తొలగిస్తుంది. చెరుకు రసంలో ఉండే సహజ ఆల్ఫా-హైడ్రాక్సీ ఆమ్లాలు చర్మాన్ని సున్నితంగా ఎక్స్ఫోలియేట్ చేస్తాయి. ఇది మీ చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.

మచ్చలేని చర్మం, అందంగా మెరిసే జుట్టు కోసం.. చెరుకు రసం.. ఇంకా బోలెడన్నీ ప్రయోజనాలు..
Sugarcane Juice F
Follow us
Jyothi Gadda

|

Updated on: May 26, 2023 | 6:15 PM

అసలే ఎండాకాలం.. పైగా ఎండవేడిమితో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటకు వెళ్లినవారు కొబ్బరి బొండాలు, నిమ్మరసం, చెరుకు రసం వంటివి కనిపిస్తే.. తప్పనిసరిగా బండి ఆపి మరీ తాగుతుంటారు. ఎండవేడిని తట్టుకోలేక ఓ పెద్ద గ్లాసు చెరుకు రసం తాగినప్పుడు ప్రాణం హాయిగా ఉంటుంది. అయితే చెరుకు రసం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? స్వచ్ఛమైన పచ్చి చెరుకు రసం అనేక సమస్యలకు సహజ నివారణగా పనిచేస్తుంది. ఇన్ఫెక్షన్లను నివారించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఇతర ఎలక్ట్రోలైట్‌లలో సమృద్ధిగా ఉంటాయి. శరీరంలోని ప్రోటీన్ స్థాయిలను పెంచుతుంది. జలుబు, జ్వరం వంటి వ్యాధుల చికిత్సలో సహాయం చేస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన చెరుకు రసంతో చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు కూడా తీరిపోతాయని మీకు తెలుసా..?

చెరుకు రసం చర్మానికి అద్భుతమైన నేచురల్ మాయిశ్చరైజర్‌గా కూడా పనిచేస్తుంది. దీనిలోని అధిక గ్లైకోలిక్ యాసిడ్ కంటెంట్ చర్మం తేమను నిలుపుకోవడానికి, చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి, పొడిబారకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. చెరుకును క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల పొరలుగా ఉండే చర్మం, డల్ నెస్, పాచెస్ వంటి చర్మ సమస్యలు తగ్గిపోతాయి. చెరకు రసంలోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను ఎదుర్కోవడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. చెరుకులో ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు ఉంటాయి. ఇది బ్యాక్టీరియా పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది. సెబమ్ ను తొలగిస్తుంది. దీని సహజ ఆమ్లాలు రంధ్రాలను మూసివేయడానికి.. అదనపు నూనె ఉత్పత్తిని తగ్గించడానికి, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఏర్పడకుండా నిరోధించడానికి సహాయపడతాయి. చెరుకు రసాన్ని క్రమం తప్పకుండా వాడటం వల్ల మొటిమలు, మొటిమల మచ్చలు తగ్గిపోతాయి. మీ ముఖం మెరిసిపోతుంది. అంతేకాదు..

ఇంకా చెరుకు రసం మీలోని వృద్ధాప్య సంకేతాలను కూడా దూరం చేస్తుంది. చెరుకు రసం మీ శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్ డ్యామేజ్ ను నివారిస్తుంది. చెరుకు రసంలో విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని నివారించడానికి సహాయపడతాయి. ఇది సన్నని గీతలు, ముడతలు, వయస్సు రీత్యా వచ్చిన మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది. చెరుకు రసం మీరు యవ్వనంగా, అందంగా కనిపించేలా చేస్తుంది. మీ స్కిన్ రంగును కూడా మెరుగుపరుస్తుంది. శరీరంపై మృతకణాలను తొలగిస్తుంది. చెరుకు రసంలో ఉండే సహజ ఆల్ఫా-హైడ్రాక్సీ ఆమ్లాలు చర్మాన్ని సున్నితంగా ఎక్స్ఫోలియేట్ చేస్తాయి. ఇది మీ చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. చెరుకు రసంతో క్రమం తప్పకుండా ఎక్స్ఫోలియేషన్ చేయడం వల్ల చర్మం ఆకృతి మెరుగుపడుతుంది.

ఇవి కూడా చదవండి

అంతేకాదు.. చెరుకు రసం జుట్టు సంరక్షణలో కూడా ఉపయోగపడుతుంది. చెరుకు రసం జుట్టును హైడ్రేట్ చేస్తుంది. అలాగే కండిషన్ చేస్తుంది. చుండ్రును కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే ఇది జుట్టు బాగా పెరిగేందుకు సహాయపడుతుంది. విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు వంటివి చెరకు రసంలో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషణను అందిస్తాయి. దీంతో మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. చెరుకు నేచురల్ కండీషనర్ గా పనిచేస్తుంది. చెరుకు రసం వెంట్రుకలకు చక్కటి మెరుపుతో పాటు మృదువుగా మారేలా చేస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..