AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aloevera Toothpaste: జస్ట్ ఫర్ చేంజ్.. రోజులా పేస్టుతో కాకుండా అలోవెరా జెల్ బ్రెష్ చేయండి.. బోలెడు ప్రయోజనాలు..

ఈ కలబంద చూడటానికి కొంచెం దట్టాంగా ముళ్ళు స్వభావం కలిగి ఉండి. జిగురులాంటి గుజ్జు పదార్థాంతో నిండి ఉంటుంది. కలబంద అన్ని రకాలైనటువంటి భూముల్లో..కుండీల్లో కూడా పెరుగుతుంది. అయితే చర్మ వ్యాదుల చికిత్స కోసం మాత్రమే మనం ఉపయోగిస్తున్నాం. ఇది మాత్రమే కాదు పంటి సమస్యలకు కూడా దీంతో చెక్ పెట్టవచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..

Aloevera Toothpaste: జస్ట్ ఫర్ చేంజ్.. రోజులా పేస్టుతో కాకుండా అలోవెరా జెల్ బ్రెష్ చేయండి.. బోలెడు ప్రయోజనాలు..
Toothpaste
Sanjay Kasula
|

Updated on: May 26, 2023 | 5:10 PM

Share

కలబంద తరచుగా సౌందర్య ప్రయోజనాలతో ముడిపడి ఉంటుంది. మనం ఎక్కవగా దీన్ని చర్మంపై ఉపయోగిస్తాం. అలోవెరా జెల్‌ను చిన్నపాటి కాలిన గాయాలు, చర్మంపై దద్దుర్లు, గాయాలు, ఇతర చర్మ వ్యాధులకు చికిత్స చేయడానికి ఉపయోగించవచ్చు. అలోవెరా జెల్ అనేది చర్మానికి అప్లై చేసే అత్యుత్తమ సహజమైన మాయిశ్చరైజర్లలో ఒకటి. తాజా అలోవెరా జెల్ (తినదగిన కలబంద నుండి పొందబడింది) ను స్మూతీస్‌గా తయారు చేసి, శరీరం వేడెక్కకుండా నిరోధించడానికి తినవచ్చు. అలోవెరా జెల్‌ను నూనెలో కలిపి జుట్టుకు, తలకు పట్టించాలి. ఇది మీ జుట్టు తంతువులను సున్నితంగా, సిల్కీగా మరియు ఆరోగ్యవంతంగా చేస్తుంది.

అయితే ఇది నోటి ఆరోగ్యానికి కూడా మెరుగు పరుస్తుంది. అవును, మీరు కలబందతో మీ దంతాలను కూడా శుభ్రం చేసుకోవచ్చు. మీరు ఉదయాన్నే లేచి టూత్‌పేస్ట్‌తో బ్రష్ చేయడానికి బదులుగా మీ బ్రష్‌పై తాజా కలబంద జల్ అప్లై చేయడం ద్వారా మీ దంతాలను శుభ్రం చేసుకోవచ్చు. దీంతో ఒకటి, రెండు ప్రయోజనాలు కాదు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కలబంద జెల్‌తో బ్రష్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం ఇవాళ ఇక్కడ తెలుసుకుందాం..

పసుపు రంగును తొలగించండి

దంతాల మీద పసుపు రంగు రావడం చాలా సాధారణం. మనం కొంచెం అజాగ్రత్తగా ఉన్నా, పళ్ళపై పసుపురంగు మొదలవుతుంది. ఇది మన చిరునవ్వుపై ప్రభావం చూస్తింది. పది మందిలో మనసు విప్పి నవ్వాలంటే భయపడిపోతాం. దంతాల పసుపు రంగును తొలగించడానికి.. పగటిపూట తాజా కలబంద జెల్‌తో బ్రష్ చేయండి. దీంతో వారం రోజుల్లో మీ దంతాలు మునుపటిలా తెల్లగా కనిపిస్తాయి.

ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ

అలోవెరా జెల్ చర్మాన్ని ఇన్ఫెక్షన్ నుంచి కాపాడడమే కాకుండా నోటిని అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ దంతాల ఇన్ఫెక్షన్‌ను నివారించడమే కాకుండా నాలుక, చిగుళ్లలో కూడా సహాయపడుతుంది. నోటిలోని ఇతర భాగాలను ఇన్ఫెక్షన్ నివారిస్తుంది.

తెల్ల నాలుకపై పని

నాలుకపై ఏర్పడిన తెల్లటి పొర కూడా చాలా పనికిరానిదిగా కనిపిస్తుంది. కొన్నిసార్లు ఇది దుర్వాసన మొదలవుతుంది. నోటిలో వింత రుచి ఉంటుంది. ఈ సందర్భంలో మీరు అలోవెరా జెల్ సహాయంతో దాన్ని వదిలించుకోవచ్చు. నాలుకలోని తెల్లటి పొరను తొలగించడంలో సహాయపడే అనేక యాంటీ ఫంగల్ ఏజెంట్లు కలబందలో ఉన్నాయి.

చెడు వాసనను తొలగించండి

అనేక సార్లు బ్రష్ చేసిన తర్వాత కూడా, కొంతమంది నోటి దుర్వాసన ప్రారంభమవుతుంది. ఈ సందర్భంలో, మీరు సహజ అలోవెరా జెల్ ఉపయోగించవచ్చు. దీనితో, మీ నోరు చాలా గంటలు తాజాగా ఉంటుంది. చెడు వాసన ఉండదు. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు శరీరాన్ని ఎక్కువ కాలం తాజాగా ఉంచడంలో సహాయపడతాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం