ఆమెకు ఇప్పటికే ఆరుగురు అమ్మాయిలు.. మళ్లీ ఆడపిల్ల పుట్టడంతో ఏం చేసిందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు
ఈ సమాజంలో ఆడపిల్ల పుడితే ఇప్పటికీ బాధపడే తల్లిదండ్రులు ఉన్నారు. కుటుంబానికి ఆడపిల్ల భారం అనే ఆలోచన నుంచి చాలామంది తల్లిదండ్రులు ఇంకా బయటపడలేదు. అయితే ఓ మహిళ మాత్రం తనకు ఆడపిల్ల పుట్టడంతో ఆసుపత్రిలోనే వదిలేసి వెళ్లిపోవడం కలకలం రేపుతోంది.
ఈ సమాజంలో ఆడపిల్ల పుడితే ఇప్పటికీ బాధపడే తల్లిదండ్రులు ఉన్నారు. కుటుంబానికి ఆడపిల్ల భారం అనే ఆలోచన నుంచి చాలామంది తల్లిదండ్రులు ఇంకా బయటపడలేదు. అయితే ఓ మహిళ మాత్రం తనకు ఆడపిల్ల పుట్టడంతో ఆసుపత్రిలోనే వదిలేసి వెళ్లిపోవడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లోని జనతా ఆసుపత్రికి ఓ మహిళ ప్రసవం కోసం వచ్చింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆమెకు ఇప్పటికే ఆరుగురు ఆడపిల్లలు ఉన్నారు. అయితే ఈసారి కూడా ఆడపిల్ల పుట్టడంతో ఆసుపత్రిలోనే వదిలేసి వెళ్లిపోయింది. అంతేకాదు ఓ ఉత్తరాన్ని కూడా రాసింది.
ఇప్పటికే నాకు ఆరుగురు ఆడపిల్లలున్నారని.. ఈసారి కూడా అమ్మాయే పుట్టిందని ఆ ఉత్తరంలో తెలిపింది. మా అత్త నన్నెంతో ఇబ్బంది పెడుతోందని.. అందకే ఇలాంటి పని చేస్తున్నానని చెప్పింది. మీకు అనుకూలంగా ఉంటే నా కుమార్తెను పెంచండి, నన్ను క్షమించండి అంటూ రాసుకొచ్చింది. ఆ తర్వాత తన ఆడశిశువుని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయింది. ఆసుపత్రిలో ఏడుస్తున్న శిశువును గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అలాగే ఆ చిన్నారిని తగిన రక్షణ ఏర్పాట్లు చేసి వార్డుకు తరలించారు. ఆ శిశువు ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం