Pawan Kalyan: రహస్య చర్చలతో జనసేనాని బిజీ బిజీ.. పవన్‌తో చర్చిస్తున్నదెవరు..? ఏపీ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ..

Pawan Kalyan's Secret Meeting: పవన్‌ కల్యాణ్‌ వస్తున్నారంటే.. ఒక్కటే హడావిడి ఉంటుంది. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ దగ్గర్నుంచి మంగళగిరి జనసేన ఆఫీస్‌ వరకు పార్టీ నేతలు, కార్యకర్తల కోలాహలం కొనసాగుతుంది. జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అయితే

Pawan Kalyan: రహస్య చర్చలతో జనసేనాని బిజీ బిజీ.. పవన్‌తో చర్చిస్తున్నదెవరు..? ఏపీ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ..
Pawan Kalyan's Secret Meeting
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 26, 2023 | 1:55 PM

Pawan Kalyan’s Secret Meeting: పవన్‌ కల్యాణ్‌ వస్తున్నారంటే.. ఒక్కటే హడావిడి ఉంటుంది. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ దగ్గర్నుంచి మంగళగిరి జనసేన ఆఫీస్‌ వరకు పార్టీ నేతలు, కార్యకర్తల కోలాహలం కొనసాగుతుంది. జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అయితే కచ్చితంగా ఉండాల్సిందే!. మరికొందరు ముఖ్యనేతల హడావిడి కూడా కామన్‌. కానీ, ఈసారి ట్రిప్‌లో అవన్నీ మిస్‌ అయ్యాయ్‌!. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి వచ్చిన దగ్గర్నుంచి మంగళగిరి వెళ్లేవరకూ ఒక్కటే సైలెన్స్‌ అండ్‌ సస్పెన్స్‌!. పార్టీ ఆఫీస్‌లో అయినా హడావిడి, హంగామా ఉందంటే అదీ కనిపించడం లేదు. పవన్‌ కల్యాణ్‌ ఒక్కరే ఒంటరిగా గడిపేస్తున్నారు. పోనీ ఖాళీగా ఉన్నారా అంటే కానేకాదు. వరుస సమావేశాలు, కీలక చర్చలతో ఫుల్‌ బిజీగా గడుపుతున్నారు. కానీ, ఇవన్నీ పార్టీ ముఖ్యనేతలు ఎవరూ లేకుండానే..! కేవలం సమావేశాలు, చర్చలే కాదు.. జనసేన అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌ను కూడా ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా ఒంటరిగానే ప్రారంభించేశారు పవన్‌.

అయితే ఇదే ఇప్పుడు జనసేన వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. పవన్‌ వస్తున్నారంటే మీడియా అటెన్షన్ అంతా అటువైపే ఉంటుంది. జనసేన కూడా మీడియాకి ఇన్ఫర్మేషన్‌ ఇచ్చేది. కానీ, ఈసారి అవేమీ జరగలేదు. పవన్‌ వెంట పొలిటికల్‌ కార్యదర్శి లేరు. సొంత పార్టీ లీడర్లు లేరు. పవన్‌ వెంట రెగ్యులర్‌గా కనిపించే టీమ్‌ అస్సలు లేదు. మీడియానీ కూడా రానివ్వడం లేదు. దాంతో, పవన్‌ టూర్‌పై సస్పెన్స్‌ క్రియేట్‌ అవుతోంది.

ఇంతకీ, పవన్‌ ఒక్కరే.. ఎవరితో సమావేశం అవుతున్నారు?. ఎవరితో చర్చలు జరుపుతున్నారు?. అంటే ఒక్కటే మాట వినిపిస్తోంది. అసలు, రాష్ట్రంలో జనసేన పరిస్థితి ఏంటి?. పార్టీ బలమెంత?. ఏఏ నియోజకవర్గాల్లో జనసేన పటిష్టంగా ఉంది!, ఎక్కడెక్కడ పోటీ చేయాలనే అంశాలపై విస్తృత మంతనాలు జరుపుతున్నారు పవన్‌. రేస్‌ సర్వే సంస్థతో నిన్నంతా చర్చలు జరిపిన పవన్‌… ఇవాళ కూడా ఇంటర్నల్‌గా డిస్కషన్స్‌ చేస్తు్న్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..