Vijayawada: బెజవాడలో మారువేషంలో సూరత్ పోలీసులు.. అసలు విషయం తెలిసి స్టన్ అయిన స్థానికులు
సూరత్‌లోని జహంగీపురా ప్రాంతానికి చెందిన ఓ మహిళా ప్రొఫెసర్ నెలన్నర క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేసు దర్యాప్తులో భాగంగా , బీహార్ రాష్ట్రంలోని జముయ్ ప్రాంతానికి చెందిన ముగ్గురు నిందితులను ప్రాణాలకు తెగించి పట్టుకున్నారు రాండర్ పోలీసులు. వారిని విచారించగా స్టన్ అయ్యే విషయాలు వెలుగుచూశాయి.
సూరత్‌లోని ఓ మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు కొందరు వ్యక్తులు మార్ఫింగ్ చేసిన ఆమె న్యూడ్ ఫోటోలను సెండ్ చేశారు. వాటిని వైరల్ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు.. రోజురోజుకు వాళ్ల వేధింపులు ఎక్కువ అవ్వడంతో ఆమె రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సూరత్‌లోని రాండర్ పోలీసులు ఈ కేసు దర్యాప్తును సీరియస్‌గా తీసుకున్నారు. ఇందులో భాగంగానే ముఠాలోని ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి విచారించగా అసలు విషయం బయటపడింది. విచారణలో షాకింగ్ విషయాలు తెలిశాయి. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉంది ఓ మహిళ. ఆమె విజయవాడకు చెందిన ముస్లిం మహిళ మహ్మద్ జుహీ సలీం షేక్‌గా గుర్తించారు.. ఆమె కోసం విజయవాడ వచ్చిన గుజరాత్ పోలీసులు బుర్ఖాలో రెక్కీ నిర్వహించి మరీ ఆమెను అరెస్ట్ చేశారు.
మృతురాలు సూరత్‌లోని వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా వర్క్ చేసేవారు. బ్యాంకు లోన్స్‌కు సంబంధించిన సమాచారం కోసం ఆమె తన సెల్‌ఫోన్‌లో క్యాష్‌మీ మొబైల్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుంది. యాప్‌ను డౌన్‌లోడ్ చేసినప్పుడు ఆమె సెల్‌ఫోన్‌ను హ్యాక్ చేసి క్లోన్ చేశారు నిందితులు. ఆపై ఆమె మార్ఫింగ్ నగ్న ఫోటోలను ఉపయోగించి బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డారు. ఈ కేసు విచారణలో బీహార్‌లోని జాముయి ప్రాంతానికి చెందిన ముగ్గురు నిందితుల అభిషేక్ కుమార్ సింగ్, రోషన్ కుమార్ సింగ్, సౌరభ్ గజేంద్ర కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు.
వారిని విచారించగా.. మరో నలుగురు నిందితులు అంకిత్ రేషంకుమార్, లక్బీర్ ట్రేడర్స్, జుహీ షేక్, శంతను జోంఘలేల పాత్ర వెలుగులోకి వచ్చింది. జూహీ షేక్ లొకేషన్ ట్రేస్ చేయగా.. ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ పంజా సెంటర్‌లో ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. రాండర్ పోలీసుల విజయవాడకు వచ్చి మారువేషంలో సంచరించి.. జుహీ షేక్‌ను అరెస్ట్ చేశారు. విజయవాడలోని కోర్టు నుంచి ట్రాన్సిట్ రిమాండ్ తీసుకున్న తర్వాత మంగళవారం రాత్రి నిందితురాలిని సూరత్‌కు తీసుకొచ్చారు. జూహీ షేక్ సోషల్ మీడియా ఖాతాలు, జిమెయిల్ ఐడిని తనిఖీ చేయగా, ఆమెకు పాకిస్తాన్‌కు చెందిన జుల్ఫికర్ అనే వ్యక్తితో సంబంధం ఉందని రాండర్ పోలీసులు గుర్తించారు. ఆమె క్రిప్టో కరెన్సీ ద్వారా జుల్ఫికర్‌కు డబ్బు బదిలీ చేసేదని తేల్చారు. ఈ కేసులో మరో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు వేట కొనసాగుతుంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..