Avinash Reddy: ఎంపీ అవినాష్ రెడ్డికి హైకోర్టులో ఊరట.. అప్పటివరకు అరెస్ట్ చేయవద్దంటూ కీలక ఆదేశాలు
కడప ఎంపీ అవినాష్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఆయనను బుధవారం వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈమేరుకు అవినాష్ తల్లి శ్రీలక్ష్మి గుండె
కడప ఎంపీ అవినాష్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఆయనను బుధవారం వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈమేరుకు అవినాష్ తల్లి శ్రీలక్ష్మి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో బుధవారం వరకు అరెస్ట్ చేయకుండా అదేశాలు ఇవ్వాలని అవినాష్ న్యాయవాది కోరగా న్యాయమూర్తి సానుకూలంగా స్పందించారు. బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఈనెల 31కి వాయిదా వేసింది. అప్పటి వరకు అవినాష్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందు అవినాష్ రెడ్డి బెయిల్‌పై హైకోర్టులో సీబీఐ సంచలన వాదనలు చేసింది. అవినాష్‌ను అదుపులోకి తీసుకుంటేనే దర్యాప్తు ముందుకెళ్తుందన్న సీబీఐ తెలిపింది. ‘ విచారణలో అవినాష్ అన్నీ అబద్ధాలే చెప్పారు. వివేకా మరణం గురించి అవినాష్‌కు ముందే తెలుసు. థర్డ్ పర్సన్ నుంచి ఫోన్ వచ్చేవరకు అవినాష్ ఇంట్లోనే వేచి చూశారు’ అని సీబీఐ తన వాదనలు వినిపించగా ఆధారాలు ఉన్నాయా అంటూ హైకోర్టు ప్రశ్నించింది. దీనికి ప్రతిస్పందనగా ‘హత్య జరిగిన రోజు ఎక్కడున్నారంటే జమ్మలమడుగులో ఉన్నారని ఎంపీ చెప్పారు. కానీ తమ దర్యాప్తులో అది అబద్ధమని తేలింది. ఆరోజు అవినాష్ వాట్సాప్ చాట్ చేసినట్టు IDPR డేటాలో తేలింది. కానీ, ఎవరితో మాట్లాడారో తెలియాల్సి ఉంది’ అని సీబీఐ పేర్కొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..