NTR District: రాత్రి అక్కడ అంతా నార్మల్‌గానే ఉంది.. కానీ తెల్లారాక లేచి చూడగానే హడల్..
ఓ వైపు అభివృద్ధి అంతరిక్షం వైపు పరుగులు తీస్తోంది. మరోవైపు సమాజంలో ఇంకా మూఢనమ్మకాల జాడ్యం కొనసాగుతూనే ఉంది. మంత్రాలకు చింతకాయలు రాలవుగాక రాలవు. ఈ నిజాన్ని అర్ధం చేసుకోలేని కొంత మంది ఇంకా మూఢనమ్మకాల్లో మునిగి తేలుతున్నారు.
రాకెట్ యుగంలో ఇంకా మంత్రాలు, తంత్రాలా? అభివృద్ధి చెందిన పల్లెబాటలో చేతబడి మంత్రాంగం ఎవరిది? సైబర్ యుగంలోనూ అబ్రకదబ్ర మాయామశ్చీంద్రగాళ్లున్నారా? అత్యంత ప్రమాదకారి వైరస్ కరోనాకు కూడా మెడిసిన్ కనిపెట్టేశాం. కానీ ఈ మూడ నమ్మకాలను మాత్రం కొందరి మెదళ్లు నుంచి వేరుచేయలేకపోతున్నాం. కాలం ఎంత మారుతున్నా.. ఇప్పటికీ గ్రామాల్లో అక్కడక్కడా క్షుద్రపూజలనే మాట మాత్రం వినిపిస్తూనే ఉంది. కుద్రపూజలు, బాణామతి, మంత్రతంత్రాల గురించి వార్తలు మనం తరచుగా వింటూనే ఉన్నాం. తాజాగా ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది.
విసన్నపేట మండలం గోరంపాలెంలో తీవ్ర కలకలం చెలరేగింది. చేతబడి భయంతో ఆ గ్రామస్థులు వణికిపోతున్నారు. అందుకు రీజన్ ఉందండోయ్. ఓ ఇంటి ఆవరణలోని నీటితొట్టెలో మాంసం ముద్దలు, నిమ్మకాయలు వదిలివెళ్లారు గుర్తుతెలియని వ్యక్తులు. దీంతో ఆ ఇంట్లో వారి టెన్షన్ అంతా.. ఇంతా కాదు. గతంలో ఇలాంటి ఘటనే జరిగిందని.. దీంతో ఆ ఇంటి మహిళ ఆందోళన చెంది అనారోగ్యంతో మృతి చెందిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ తరహా భయాందోళనలు రేపుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇలాంటివి చేస్తున్నారని ఎవరూ భయపడ వద్దంటున్నారు జనవిజ్ఞాన వేదిక సభ్యులు. ఈ పూజలతో ఎవరికీ ఎలాంటి హాని జరగదని భరోసా ఇస్తున్నారు . చదువుకున్న వారు సైతం క్షుద్ర పూజలకు ప్రభావం అవుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గ్రామాలలోనే కాకుండా … అప్పుడప్పుడు నగరాల్లో కూడా ఇలా ఘటనలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
రిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..