Team India: ఐపీఎల్ తర్వాత టీమిండియా షెడ్యూల్ ఇదే.. ఆ వన్డే సిరీస్ నుంచి రోహిత్, కోహ్లీ ఔట్.. సారథిగా ఎవరంటే?

Team India Schedule: ఐపీఎల్ 16వ సీజన్ ముగిసిన వెంటనే భారత్ జట్టు ఇంగ్లాండ్ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్ జూన్ 7 నుంచి 11 వరకు జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్ కోసం సర్వం సిద్ధంగానే..

Team India: ఐపీఎల్ తర్వాత టీమిండియా షెడ్యూల్ ఇదే.. ఆ వన్డే సిరీస్ నుంచి రోహిత్, కోహ్లీ ఔట్.. సారథిగా ఎవరంటే?
Hardik Pandya
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 26, 2023 | 3:39 PM

Team India Schedule: ఐపీఎల్ 16వ సీజన్ ముగిసిన వెంటనే భారత్ జట్టు ఇంగ్లాండ్ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్ జూన్ 7 నుంచి 11 వరకు జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్ కోసం సర్వం సిద్ధంగానే ఉంది. అయితే WTC Final ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలోనే ఆఫ్ఘానిస్తాన్‌తో 3 వన్డేల సిరీస్‌ ఆడనుంది. మరోవైపు ఈ సిరీస్ రద్దవుతుందనే వార్తలు వస్తున్నప్పటికీ.. త్వరలో జరగనున్న వన్డే వరల్డ్ కప్ 2023 కోసం అఫ్ఘాన్‌తో జరిగే సిరీస్ ఉపయోగపడుతుందని పలువురు క్రికెట్ విశ్లేషకుల వాదన.

రానున్న మెగా ఈవెంట్ కోసం సీనియర్లను సన్నద్ధం చేయాలని యోచిస్తున్న బీసీసీఐ.. సీనియర్లకు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తోందని సమాచారం. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ, స్పీడ్‌స్టర్ మహమ్మద్ షమీని ఈ సిరీస్ నుంచి తప్పించాలని.. అప్పుడే జులైలో వెస్ట్ ఇండీస్ టూర్‌కి వారు అందుబాటులో ఉంటారని అనుకుంటోంది. ఎందుకంటే జూలై 12 నుంచి ఆగస్టు 13 వరకు వెస్టిండీస్‌తో భారత్ 2 టెస్టులు, 3 వన్డేలు, 5 T20 మ్యాచ్‌లు ఆడనుంది. ఆ తర్వాత ఐర్లాండ్‌లో 3 మ్యాచ్‌ల T20 సిరీస్‌.. ఆ వెంటనే ఆసియా కప్ ఉంది. అలాగే అసియా కప్‌కి, వన్డే ప్రపంచ కప్‌కి మధ్యలో టీమిండియా అస్ట్రేలియాతో స్వదేశంలోనే సిరీస్ ఆడుతుంది.

ఇలా బిజీ బిజీ క్యాలెండర్‌ ఉన్న నేపథ్యంలో సీనియర్లకు విశ్రాంతి ఇవ్వడం మేలని బీసీసీఐ భావిస్తోందని సమాచారం. ఈ మేరకు ఆఫ్ఘాన్ సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చి.. అతని స్థానంలో హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. పాండ్యా కూడా ఇటీవలే రోహిత్ గైర్హాజరీతో ముంబై వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌కు సారథ్య బాధ్యతలు నిర్వర్తించాడు. ఇదిలా ఉండగా.. కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్‌‌ ఇంకా గాయాల నుంచి కోలుకోని నేపథ్యంలో యశస్వి జైస్వాల్, రింకు సింగ్, తిలక్ వర్మ వంటి  యువ ప్లేయర్లకు జాతీయ జట్టు ద్వారాలు తెరుచుకునే అవకాశం మెండుగా ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..