GT vs MI, Qualifier 2: ‘ముంబై’ ఫైనల్ ఆశలకు గండి పడినట్లేనా..? కీలక ఆటగాళ్లతో బరిలోకి దిగబోతున్న గుజరాత్ టైటాన్స్..

GT vs MI, Qualifier 2: ఐపీఎల్‌ 16వ సీజన్ క్వాలిఫియర్‌-2 పోరుకు సర్వం సిద్ధమయింది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ రోజు రాత్రి జరిగే ఈ మ్యచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌‌తో ముంబై ఇండియన్స్‌ తలపడనుంది. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ 2023 ఫైనల్‌..

GT vs MI, Qualifier 2: ‘ముంబై’ ఫైనల్ ఆశలకు గండి పడినట్లేనా..? కీలక ఆటగాళ్లతో బరిలోకి దిగబోతున్న గుజరాత్ టైటాన్స్..
Gt Vs Mi Qualifier 2
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 26, 2023 | 2:24 PM

GT vs MI, Qualifier 2: ఐపీఎల్‌ 16వ సీజన్ క్వాలిఫియర్‌-2 పోరుకు సర్వం సిద్ధమయింది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ రోజు రాత్రి జరిగే ఈ మ్యచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌‌తో ముంబై ఇండియన్స్‌ తలపడనుంది. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ 2023 ఫైనల్‌కు చేరుతుంది. ఇక ఆదివారం ఇదే స్టేడియంలో జరిగే ఫైనల్‌కి చెన్నైసూపర్‌ కింగ్స్‌ ముందుగానే చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నై టీమ్‌తో ఫైనల్ ఆడేందుకు ఇటు గుజరాత్ టైటాన్స్, అటు ముంబై ఇండియన్స్ తెగ ఉవ్విళ్లూరుతున్నాయి.

అయితే అంతకకంటే ముందుగా నేటి క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో ఒకరిపై మరొకరు గెలవాలని ఇరు జట్లు చూస్తున్నాయి. ఇక నేటి మ్యాచ్ కోసం గుజరాత్‌ జట్టు 2 మార్పులతో బరిలోకి దిగనుందని సమాచారం. ఈ మేరకు దసున్‌ షనక, దర్శన్‌ నల్కండే స్థానాల్లో జాషువా లిటిల్‌, సాయిసుదర్శన్‌ను తుదిజట్టులోకి తీసుకురావాలని గుజరాత్‌ మెనెజ్‌మెంట్‌ భావిస్తోంది. తద్వారా ఆడుతున్న రెండో సీజన్‌లో కూడా ట్రోఫీని సొంతం చేసుకోవాలని డిఫెండింగ్ చాంప్స్ అనుకుంటోంది.

మరోవైపు బుధవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై 81 పరుగుల తేడా భారీ విజయం సాధించిన ముంబై ఇండియన్ విజయోత్సాహంతో ఉంది. ఇదే తరహాలో నేటి మ్యాచ్‌లో కూడా గెలిచి, తమ చిరకాల ప్రత్యర్థి అయిన చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడాలని తహతహలాడుతోంది రోహిత్ సేన.

ఇవి కూడా చదవండి

తుది జట్లు(అంచనా)

గుజరాత్‌ టైటాన్స్‌ XI: శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా(వికెట్‌ కీపర్‌), సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, జాషువా లిటిల్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్

ముంబై ఇండియన్స్‌ XI: రోహిత్ శర్మ(కెప్టెన్‌), ఇషాన్ కిషన్(వికెట్‌ కీపర్‌), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, తిలక్ వర్మ, క్రిస్ జోర్డాన్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, ఆకాష్ మధ్వల్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..