- Telugu News Photo Gallery Cricket photos The Kapil Sharma Show: veteran cricketers and Kapil's 'Big Brothers' Brett Lee, Chris Gayle to grace the show
Trending Photos: ఒకే వేదికపై క్రిస్ గేల్, కపిల్ శర్మ, బ్రెట్ లీ.. పాట పాడుతూ స్టెప్పులేసిన త్రయం.. త్వరలోనే కామెడీ షోకి రాబోతున్నారా..? ..
ఒకే వేదికపై ఓ స్టార్ కమెడియన్, దిగ్గజ బ్యాట్స్‌మ్యాన్, నిప్పులు చెరిగే బౌలర్ ఉంటే.. ఆ స్టేజ్ దద్దరిల్లిపోతుంది. అలాంటిది వారు ఏకంగా కాలు కదిసి స్టేప్పులేస్తే.. ఇక టాప్ లేసిపోయినట్లే కదా.. !
Updated on: May 26, 2023 | 1:26 PM

స్టార్ కమెడియన్, యాక్టర్ కపిల్ శర్మతో కలిసి దిగ్గజ క్రికెటర్లు క్రిస్ గేల్, బ్రెట్ లీ పాటలు పాడుతూ స్టెప్పులేశారు.

క్రిస్ గేల్, బ్రెట్ లీతో కలిసి కపిల్ శర్మ ఫోటోషూట్ చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు కపిల్ శర్మ షోకి అతిథులుగా వచ్చినప్పుడు ఈ ఫోటోషూట్ జరిగిందని కొందరు నెటిజన్లు అంటున్నారు. మరి కొందరు.. కపిల్ శర్ షోకి కొన్ని రోజుల్లోనే బ్రెట్ లీ, క్రిస్ గేల్ రాబోతున్నారని అభిప్రాయపడుతున్నారు.

కాగా, గతంలో బ్రెట్ లీ, క్రిస్ గేల్ వేర్వేరు ఎపిసోడ్లలో కపిల్ శర్మ షోకి వచ్చారు.

ఇక కపిల్ శర్మ షో గురించి అందరికీ తెలిసిందే.. భారతీయ టీవీ ప్రపంచంలో ఒక సుప్రసిద్ధ కామెడీ షో ఇది. దీనికి కపిల్ శర్మ హోస్ట్.

క్రిస్ గేల్, కపిల్ శర్మ, బ్రెట్ లీ
