- Telugu News Photo Gallery Cricket photos Virat Kohli Creates new History and becomes first Indian to reach 250 million Instagram followers
Virat Kohli: దటీజ్ కింగ్ కోహ్లీ..! మైదానంలోకి దిగకుండానే సరికొత్త చరిత్ర.. తొలి భారతీయుడిగా, మూడో క్రీడాకారుడిగా..
ఐపీఎల్ 2023: ఐపీఎల్ 16వ సీజన్‌లో ఎన్నో రికార్డులు నెలకొల్పిన విరాట్ కోహ్లీ.. ఇప్పుడు మైదానంలోకి రాకుండానే మరో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం..
Updated on: May 26, 2023 | 12:48 PM

ఐపీఎల్ 2023: ఐపీఎల్ 16వ సీజన్‌లో ఎన్నో రికార్డులు నెలకొల్పిన విరాట్ కోహ్లీ.. ఇప్పుడు మైదానంలోకి రాకుండానే మరో సరికొత్త రికార్డు సృష్టించాడు.

అవును, ఇన్‌స్టాగ్రామ్‌లో సరిగ్గా 250 మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించి సరికొత్త రికార్డును తన పేరిట లిఖించాడు విరాట్ కోహ్లీ. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇన్‌స్టాగ్రామ్‌లో 25 కోట్ల మంది ఫాల్లోవర్స్‌ని కలిగి ఒకే ఒక క్రికెటర్, ఇంకా తొలి భారతీయుడు కూడా కోహ్లీనే.

అంతే కాకుండా ఆసియా నుంచి ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా కూడా కింగ్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. వీటితో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక మంది ఫాలోవర్స్ కలిగిన స్పోర్ట్స్ మ్యాన్‌గా కూడా కోహ్లీ మూడవ స్థానంలో నిలిచాడు.

ఈ జాబితాలో కోహ్లీ కంటే ముందు, అగ్రస్థానంలో ప్రముఖ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఉన్నాడు. పోర్చుగీస్‌కి చెందిన క్రిస్టియానోకి ఇన్‌స్టాగ్రామ్‌లో మొత్తం 58.5 కోట్ల (585 మిలియన్లు) మంది ఫాలోవర్లు ఉన్నారు.

అలాగే రెండో స్థానంలో అర్జెంటీనా గ్రేటెస్ట్ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ 46.2 కోట్ల(462 మిలియన్లు) మంది ఫాలోవర్లను కలిగి ఉన్నాడు.

వీరిద్దరి తర్వాతి స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మిషిన్, చేజింగ్ మాస్టర్, అభిమానుల కింగ్ కోహ్లీ 25 కోట్ల(250 మిలియన్లు) మంది ఫాల్లోవర్స్‌ని కలిగి ఉన్నాడు.
