Amul Lassi: లస్సీ ప్యాకెట్లలో ఫంగస్..!? వైరల్ వీడియోపై స్పందించిన అమూల్ కంపెనీ.. ఏమని బదులిచ్చిందంటే..?

Amul Lassi: ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్‌కి చెందిన లస్సీ ప్యాక్‌లలో ఫంగస్ ఉందని ఆరోపిస్తూ వైరల్ అవుతున్న వీడియోలను ఆ కంపెనీ కొట్టివేసింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా అమూల్ కంపెనీ సవివరణ ఇచ్చింది. వైరల్ అవుతున్న వీడియో కల్పితమని..

Amul Lassi: లస్సీ ప్యాకెట్లలో ఫంగస్..!? వైరల్ వీడియోపై స్పందించిన అమూల్ కంపెనీ.. ఏమని బదులిచ్చిందంటే..?
Amul Response On Viral Vide
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 26, 2023 | 3:03 PM

Amul Lassi: ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్‌కి చెందిన లస్సీ ప్యాక్‌లలో ఫంగస్ ఉందని ఆరోపిస్తూ వైరల్ అవుతున్న వీడియోలను ఆ కంపెనీ కొట్టివేసింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా అమూల్ కంపెనీ సవివరణ ఇచ్చింది. వైరల్ అవుతున్న వీడియో కల్పితమని, వినియోగదారులలో తప్పుడు సమాచారాన్ని వ్యాపింపచేయడానికే చేసిన చర్యగా అమూల్ సంస్థ తన ట్వీట్‌లో పేర్కొంది. ఇంకా వీడియోలోని లస్సీ ప్యాక్‌ల స్ట్రా హోల్ చుట్టూ దెబ్బతిన్నాయని, ఆ కారణంగానే లోపల ఫంగస్ ఏర్పడిందని, వీడియోను క్రియేట్ చేసిన వారికి ఈ విషయం బాగా తెలుసని తెలిపింది. ఆ వీడియోనే అందుకు ప్రత్యక్ష సాక్ష్యమని కూడా నొక్కి చెప్పింది.

ఇంకా వైరల్ అవుతున్న వీడియోను ఫార్వర్డ్ చేస్తూ.. ‘అమూల్ లస్సీ నాణ్యత తక్కువగా ఉందని వాట్సాప్, సోషల్ మీడియాలో ఫేక్ మెసేజ్‌ని వైరల్ చేశారు. ఈ వీడియోని తీసిన వ్యక్తి వివరణ కోసం మమ్మల్ని సంప్రదించలేదు, అలాగే ఇది ఎక్కడ జరిగిందో తెలిపేందుకు లొకేషన్ కూడా వెల్లడించలేద’ని రాసుకొచ్చింది. ఈ క్రమంలోనే ఏవైనా వివరణలు లేదా ప్రశ్నల కోసం నేరుగా తమను సంప్రదించమని కస్టమర్లను కోరింది. ఇంకా నెట్టింట వైలర్ అవుతుండే ఇలాంటి ఫేక్ వీడియోలను నమ్మవద్దని అభ్యర్థించింది.

ఇవి కూడా చదవండి

కాగా, అమూల్ లస్సీ సంబంధించిన వీడియోను షేర్ చేసిన సదరు కస్టమర్.. ఎక్స్‌పైరీ డేట్ కంటే ముందే అమూల్ లస్సీ ప్యాకెట్లకు ఫంగస్ పట్టుకుందని, నాణ్యత లోపముందని పేర్కొన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..