Tamil Nadu: మళ్లీ ‘ఐటీ’ కలకలం.. మంత్రి ఇంటికి తనిఖీలకు వెళ్లిన అధికారులపై దాడి.. కార్లు ధ్వంసం..!

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: May 26, 2023 | 1:45 PM

తమిళనాడులో ఐటీ సోదాలు కలకలం రేపాయి.. డీఎంకే నేత, సీఎం స్టాలిన్ క్యాబినెట్‌లో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీ ఇళ్లు సహా.. పలు కార్యాలయాలలో ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు ఉదయాన్నే తనిఖీలు ప్రారంభించారు.

Tamil Nadu: మళ్లీ ‘ఐటీ’ కలకలం.. మంత్రి ఇంటికి తనిఖీలకు వెళ్లిన అధికారులపై దాడి.. కార్లు ధ్వంసం..!
Tamil Nadu It Raids

Follow us on

తమిళనాడులో ఐటీ సోదాలు కలకలం రేపాయి.. డీఎంకే నేత, సీఎం స్టాలిన్ క్యాబినెట్‌లో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీ ఇళ్లు సహా.. పలు కార్యాలయాలలో ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు ఉదయాన్నే తనిఖీలు ప్రారంభించారు. శుక్రవారం మంత్రి ఇల్లు సహా.. చెన్నై, కోయింబత్తుర్, కరూర్ జిల్లాలో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే, అధికారులు తనిఖీల కోసం వెళ్లిన సమయంలో గందరగోళం నెలకొంది. డీఎంకే కార్యకర్తలు అధికారుల వాహనాలపై దాడులు నిర్వహించారు. ఐటీ రైడ్స్‌ సందర్భంగా కారూర్‌ జిల్లాలోని మంత్రి బాలాజీ తోపాటు.. అతని సోదరుడు అశోక్‌ ఇంటి దగ్గర డీఎంకే కార్యకర్తలు భారీగా గుమిగూడారు. వాళ్లను దాటుకుని అధికారులు ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో డీఎంకే నేతలు ఐటీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో అధికారులపై దాడితో పాటు వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో అధికారులు సోదాలు చేయకుండానే వెనుదిరిగారు. తనిఖీల బృందానికి ఓ మహిళా ఆఫీసర్‌ నేతృత్వం వహించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం చెన్నై, కోయింబత్తుర్, కరూర్ జిల్లాలోని 125 ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. సీఎం స్టాలిన్ క్యాబినెట్లో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీ.. కొంగుమండలంలో బలమైన నేతగా ఉన్నారు. ఈ క్రమంలో మంత్రి ఇంట్లోకి వెళ్లకుండా ఐటీ అధికారులను సెంధిల్ అనుచరులు అడ్డుకున్నట్లు సమాచారం.

అయితే, ఐటీ సంస్థపై డైరెక్ట్‌ ఎటాక్ ఇప్పుడు చర్చకు దారి తీసింది. తమిళనాడులో గత కొంతకాలంగా ఐటీ దాడుల పర్వం కొనసాగుతోంది. అధికార పక్షం నేతలనే లక్ష్యంగా చేసుకుని ఈ సోదాలు కొనసాగుతున్నాయంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu