AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC Rank Controversy: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో విచిత్రం! ఒకే నెంబర్‌.. ఒకే ర్యాంక్‌.. ఇద్దరు అభ్యర్థులు

యూపీఎస్సీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సివిల్‌ సర్వీస్‌ పరీక్షల్లో ర్యాంకు కొట్టడం ఎందరికో కల. రాత్రింబగళ్లు నిద్రాహారాలుమాని కాష్టపడతారు. ప్రతీ ఏట లక్షలాది మంది యువత ఈ పరీక్షలకు హాజరవుతుంటారు. ఫలితాల్లో తమ పేరు కనిపించగానే..

UPSC Rank Controversy: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో విచిత్రం! ఒకే నెంబర్‌.. ఒకే ర్యాంక్‌.. ఇద్దరు అభ్యర్థులు
UPSC Rank Controversy
Srilakshmi C
|

Updated on: May 26, 2023 | 1:42 PM

Share

యూపీఎస్సీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సివిల్‌ సర్వీస్‌ పరీక్షల్లో ర్యాంకు కొట్టడం ఎందరికో కల. రాత్రింబగళ్లు నిద్రాహారాలుమాని కాష్టపడతారు. ప్రతీ ఏట లక్షలాది మంది యువత ఈ పరీక్షలకు హాజరవుతుంటారు. ఫలితాల్లో తమ పేరు కనిపించగానే ప్రపంచాన్ని జయించిన ఆనందం. అన్ని దశలు దాటి చివర్తో అనుకోని అడ్డంకి ఏదైనా ఎదురైతే ఆ బాధ వర్ణణాతీతం. తాజాగా సివిల్‌ సర్వీసెస్‌ -2022 పరీక్షల తుది ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఐతే ఫలితాల్లో ఓ చిక్కు సమస్య తలెత్తింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మహిళా అభ్యర్థులకు ఒకే రోల్‌ నంబర్‌తో, ఒకే ర్యాంకు వచ్చింది. అయేషా ఫాతిమా (23), అయేషా మక్రాని (26) ఇద్దరికీ 184వ ర్యాంకు వచ్చింది. వీళ్లిద్దరిలో నిజమైన ర్యాంకర్‌ ఎవరనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ తమకు న్యాయం చేయాలంటూ ఇద్దరూ యూపీఎస్సీకి విజ్ఞప్తులు పంపారు. అలాగే స్థానిక పోలీస్ స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశారు.

చివరి దశ అయిన పర్సనాలిటీ టెస్టు (ఇంటర్వ్యూ) నిర్వహించిన తేదీలో ఈ తేడా వచ్చినట్లు యూపీఎస్సీ గుర్తించింది. వీరిద్దరికీ ఏప్రిల్‌ 25, 2023న పర్సనాలిటీ టెస్టు నిర్వహించారు. ఐతే మాక్రానీ అడ్మిట్‌ కార్డులో గురువారం అనీ, ఫాతిమా కార్డులో మంగళవారం అని రాసి ఉంది. క్యాలెండర్‌ ప్రకారం ఆ రోజు మంగళవారమే. అంతేకాకుండా ఫాతిమా అడ్మిట్‌ కార్డులో యూపీఎస్సీ వాటర్‌మార్కుతోపాటు, క్యూఆర్‌ కోడ్‌ కూడా ఉంది. మాక్రానీ అడ్మిట్‌ కార్డుపై ఇవి కనిపించలేదు. దీంతో ఫాతిమానే అసలు అభ్యర్థి అని యూపీఎస్సీ పేర్కొంది. మక్రానీని కూడా తప్పుబట్టలేమని, పొరపాటు ఎక్కడ జరిగిందో దర్యాప్తు చేస్తున్నామని యూపీఎస్సీ అధికారులు అంటున్నారు.

అలాగే హర్యాణా లోని రేవరికి చెందిన తుషార్ కుమార్, బీహార్ రాష్ట్రంలోని భాగల్పూర్ చెందిన తుషార్ కుమార్ ఇద్దరు పురుష అభ్యర్ధులకు ఇలాగే ఒకే రోల్ నంబర్, ఒకే ర్యాంక్ జారీ చేసింది. 44వ ర్యాంకు ఈ ఇద్దరి అభ్యర్ధులకు కేటాయించడం వివాదంగా మారింది. యూపీఎస్సీ ఇలాంటి తప్పిదాలు చేయదని, దీనిపై దర్యాప్తు చేసి నిజానిజాలు తెలుసుకుంటామని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.