AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amit Shah: వాకింగ్ స్టిక్ మాదిరిగా ‘రాజదండం’ను మ్యూజియంలో దాచేశారు.. కాంగ్రెస్‌పై అమిత్ షా ఫైర్..

సెంగోల్ ను మ్యూజియంలో ఉంచడంపై కేంద్ర హోంమంత్రి, బీజేపీ నాయకుడు అమిత్ షా కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. వాకింగ్ స్టిక్ మాదిరిగా రాజదండంను మ్యూజియంలో ఉంచారని.. కాంగ్రెస్ పార్టీ భారతీయ సంప్రదాయాలను, సంస్కృతిని ఎందుకు అంతగా ద్వేషిస్తోందంటూ.. అమిత్ షా ప్రశ్నలు సంధించారు.

Amit Shah: వాకింగ్ స్టిక్ మాదిరిగా ‘రాజదండం’ను మ్యూజియంలో దాచేశారు.. కాంగ్రెస్‌పై అమిత్ షా ఫైర్..
Amit Shah
Shaik Madar Saheb
|

Updated on: May 26, 2023 | 12:34 PM

Share

Amit Shah on Congress party: కొత్త పార్లమెంట్ భవనాన్ని మే 28న (ఆదివారం) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో కేంద్రం నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ.. స్పీకర్ పోడియంకు దగ్గర చారిత్రక రాజదండాన్ని (సెంగోల్) ను ఉంచనున్నారు. బ్రిటిష్ వారు భారతీయులకు అధికారాన్ని (స్వాతంత్ర్యం) అప్పగిస్తూ.. ఈ రాజదండాన్ని దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు అప్పగించారు. ఆగస్ట్ 14, 1947 రాత్రి 10.45 గంటల సమయంలో.. పండిట్ నెహ్రూ తమిళనాడులో బ్రిటిష్ వారి నుంచి అధికార మార్పిడికి ప్రతీకగా ఈ రాజదండంను స్వీకరించారు. అనంతరం, ఈ రాజదండంను అలహాబాద్ మ్యూజియంలోని నెహ్రూ గ్యాలరీలో ఉంచారు. అయితే.. ఇంతకాలం సెంగోల్ ను మ్యూజియంలో ఉంచడంపై కేంద్ర హోంమంత్రి, బీజేపీ నాయకుడు అమిత్ షా కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. వాకింగ్ స్టిక్ మాదిరిగా రాజదండంను మ్యూజియంలో ఉంచారని.. కాంగ్రెస్ పార్టీ భారతీయ సంప్రదాయాలను, సంస్కృతిని ఎందుకు అంతగా ద్వేషిస్తోందంటూ.. అమిత్ షా ప్రశ్నలు సంధించారు. ప్రవర్తనపై పునరాలోచించాలంటూ కాంగ్రెస్ కు చురకలు అంటిస్తూ.. అమిత్ షా వరుసగా ట్వీట్లు చేశారు.

‘‘భారతీయ సంప్రదాయాలను, సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంతగా ద్వేషిస్తోంది? భారతదేశ స్వాతంత్య్రానికి ప్రతీకగా తమిళనాడుకు చెందిన ఒక పవిత్ర శైవ మఠం పండిట్ నెహ్రూకు పవిత్రమైన సెంగోల్‌ (రాజదండం) ను అందించింది, అయితే అది ‘వాకింగ్ స్టిక్’గా మ్యూజియంలో దాచేశారు..’’ అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

‘‘ఇప్పుడు కాంగ్రెస్ మరో అవమానకరమైన అవమానానికి గురిచేసింది. తిరువడుతురై అధీనంలోని పవిత్ర శైవ మఠం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో సెంగోల్ ప్రాముఖ్యత గురించి ప్రస్తావించింది. కాంగ్రెస్ అధిష్టానం ఆ చరిత్రను బోగస్ అంటోంది! ప్రవర్తనపై కాంగ్రెస్ పునరాలోచించాలి.’’ అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు.

ఇదిలాఉంటే.. పార్లమెంట్ భవనాన్ని ప్రధాని కాకుండా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాలంటూ కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిలో భాగంగా 20 పార్టీలు ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశాయి. రాష్ట్రపతి ముర్ముని పూర్తిగా పక్కనపెట్టి, పార్లమెంట్ ను ప్రారంభించాలని ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం ఘోరమైన అవమానమని.. ఇది ప్రజాస్వామ్యంపై చేస్తున్న ప్రత్యక్ష దాడి అంటూ పేర్కొంటున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం..