TS Rain Alert: హైదరాబాద్‌లో బారీ వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం

హైదరాబాద్‌లో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఖైరతాబాద్‌, జూబ్లీహీల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌తో సహా పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షం కురిసింది. భాగ్యనగరంలో పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం..

TS Rain Alert: హైదరాబాద్‌లో బారీ వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం
Telangana Rain Alert
Follow us
Srilakshmi C

|

Updated on: May 28, 2023 | 5:54 PM

హైదరాబాద్‌లో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అప్పటి వరకు బానుడి భగభగలతో అల్లాడిన నగర వాసులపై చిరుజల్లులు కురిశాయి. దీంతో నగరవాసులకు ఎండ నుంచి ఊరట కలిగినట్లైంది. ఖైరతాబాద్‌, జూబ్లీహీల్స్‌, పంజాగుట్ట, ఫిలింనగర్‌, అమీర్‌పేట్‌తో సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. భాగ్యనగరంలో పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది.

విదర్భ నుంచి తెలంగాణ, ఉత్తర తమిళనాడు మీదగా ద్రోణి కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రానున్న 5 రోజుల పాటుతేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.

ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు కొముర్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెల్పింది. పలు ప్రాంతాల్లో సోమవారం పొడి వాతావరణం ఉంటుందని, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెల్పింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్