Telangana: ఏంటీ ఈ ఘోరం.. కన్నతల్లిని రోకలిబండతో కొట్టి చంపిన కూతురు
ఇటీవల తల్లి లేదా తండ్రినే కన్న కొడుకు లేదా కూతురు చంపండం అలాగే కన్నబిడ్డలన్నే తల్లి లేదా తండ్రి చంపడం లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలో జరిగిన దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ గొడవల వల్ల ఓ కుమార్తె తన కన్నతల్లిని రోకలిబండతో కొట్టి చంపడం కలకలం రేపుతోంది.
ఇటీవల తల్లి లేదా తండ్రినే కన్న కొడుకు లేదా కూతురు చంపండం అలాగే కన్నబిడ్డలన్నే తల్లి లేదా తండ్రి చంపడం లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలో జరిగిన దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ గొడవల వల్ల ఓ కుమార్తె తన కన్నతల్లిని రోకలిబండతో కొట్టి చంపడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే ఉమ్మెడ గ్రామానికి చెందిన నాగం నర్సు (52) కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆమె భర్త 20 ఏళ్ల క్రితం చనిపోయాడు. వీళ్లకు నాగం హరిత (28) అనే కుమార్తె ఉంది. అయితే ఈ తల్లికూతుర్లకు గత కొన్నేళ్లుగా కుటుంబం విషయంలో గొడవలు జరుగుతున్నాయి. వీళ్లిద్దరూ ఒకే ఇంట్లో విడివిడిగా ఉన్న గదుల్లో ఉంటున్నారు.
ఈనెల 26న ఓ విషయంలో తల్లి నర్సు. కుమార్తె హరితకు మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరిగిపోవడంతో కుమార్తె తల్లిని రోకలి బండతో ఇష్టం వచ్చినట్లు తల, ముఖంపై కొట్టేసి వెళ్ళిపోయింది. మరుసటి రోజు 27న జరిగిన విషయాన్ని హరిత తన చెల్లెలు అరుణకి, బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. మధ్యాహ్నం తన చెల్లెలు, బంధువులు వచ్చి చూడగా నర్సు చనిపోయి ఉంది. మృతురాలి మేనల్లుడు రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. నర్సు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆదివారం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..