Khammam: మధిరలో పొంగులేటి ఆఫీసుపై దుండగుల దాడి.. ఫ్లెక్సీలు, బ్యానర్లు చించివేత

ఖమ్మం మీద పట్టు కోసం బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కుస్తీలు పడుతుంటే.. ప్రస్తుతానికి ఇండివిడ్యువల్‌గా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకాస్త దూకుడు పెంచేశారు. కానీ... పొంగులేటి స్పీడుకు బ్రేకులేసే పనిలో బిజీగా ఉంది బీఆర్‌ఎస్.

Khammam: మధిరలో పొంగులేటి ఆఫీసుపై దుండగుల దాడి.. ఫ్లెక్సీలు, బ్యానర్లు చించివేత
Ponguleti Srinivas Reddy
Follow us
Ram Naramaneni

|

Updated on: May 28, 2023 | 4:38 PM

తెలంగాణా రాజకీయమంతా ఒక ఎత్తు.. ఖమ్మం జిల్లా రాజకీయం ఒక్కటీ ఒక ఎత్తు అన్నట్టుగా మారింది పరిస్థితి. అనుచర గణంతో, 200 కార్లతో ఖమ్మం ఎన్టీఆర్ మార్గ్ వద్దకొచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కానీ… పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్టీయార్ ద్రోహి అంటూ… ఖమ్మంలో ఎన్టీయార్ విగ్రహాన్ని పాలతో శుద్ధి చేశారు ఎన్టీయార్ అభిమానులు. ఇటు… ఖమ్మం బీఆర్‌ఎస్ శ్రేణులు కూడా పొంగులేటిని ఎన్టీయార్ ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదంతా ఆదివారం జరిగిన తంతు. కానీ… శనివారం పొంగులేటి అనుచరుడిపై బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్పడిన దాడి.. మరో తంతు.

మూడు రోజుల కిందట మంత్రి పువ్వాడ అజయ్‌పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్ పెట్టాడన్న కారణంతో పొంగులేటి అనుచరుడు కార్తీక్‌పై ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. అటు.. సోమవారం జరిగే జాబ్‌మేళా కోసం ముస్తాబవుతున్న మధిరలోని పొంగులేటి క్యాంప్ కార్యాలయంపై కూడా ఎటాక్ జరిగింది. ఫ్లెక్సీలు, బానర్లు చించిపారేశారు. ఈ ఘటనపై సున్నితంగా స్పందించారు మాజీ ఎంపీ పొంగులేటి. కానీ… పొంగులేటి, పువ్వాడల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు ఖమ్మం రాజకీయాన్ని వేడెక్కిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!