- Telugu News Photo Gallery Nandamuri family members Pays Tribute to Sr.NTR and NTR images displayed on Time square in new york on centenary Birth Anniversary Photos
Sr.NTR Satha jayanthi: టైం స్క్వేర్ పై అన్నగారు.. ఖండాలు దాటినా ఎన్టీఆర్ ఘనత.. కుటుంబసభ్యుల నివాళులు.. ఫొటోస్.
యుగపురుషుడు ఎన్టీఆర్ ఫొటోస్ ను అమెరికాలోని ప్రముఖ ‘న్యూయార్క్ టైం స్క్వేర్’ పై ప్రదర్శించారు. ఆ మహనీయుడి శతజయంతి సందర్భంగా.. NRI తెలుగుదేశం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.
Updated on: May 28, 2023 | 4:04 PM

శతజయంతి వేళ అన్న నందమూరి తారకరామరావును పార్టీలకు అతీతంగా స్మరించుకుంటున్నారు నేతలు, అభిమానులు. హైదరాబాద్‌లోని NTR ఘాట్ దగ్గరకు చేరుకుని నివాళులు అర్పిస్తున్నారు.

తెల్లవారుజామునుంచే NTR ఘాట్ వద్ద అభిమానుల తాకిడి కనిపించింది.

జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉదయాన్నే తాత సమాధి దగ్గర పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు తారక్.

ఈ సందర్భంగా జూనియర్ అభిమానులు... సీఎం.. సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జూనియర్ రాకతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద కోలాహలం నెలకొంది.

తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చారు నందమూరి బాలకృష్ణ. జోహార్ ఎన్టీఆర్ అంటూ పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఎన్టీఆర్ కుమారుడిగా పుట్టడం తన అదృష్టమన్నారు బాలయ్య.

ఎన్నో సంస్కరణలకు ఎన్టీఆర్ నాంది పలికారని గుర్తు చేసుకున్నారు.

ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా కుటుంబ సభ్యులంతా ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చారు. మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి నివాళులు అర్పించారు.

యుగపురుషుడు ఎన్టీఆర్ ఫొటోస్ ను అమెరికాలోని ప్రముఖ ‘న్యూయార్క్ టైం స్క్వేర్’ పై ప్రదర్శించారు.

ఆ మహనీయుడి శతజయంతి సందర్భంగా.. NRI తెలుగుదేశం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.

అమెరికా కాలమానం ప్రకారం మే 27న అర్ధరాత్రి నుంచి మే 28 అర్ధరాత్రి వరకు ప్రతి 4 నిమిషాలకు ఒకసారి 15 సెకన్ల పాటు ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా టైం స్క్వేర్ వద్దకు భారీఎత్తున చేరుకున్న తెలుగుదేశం నాయకులు, అన్నగారి అభిమానులు.. జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు.





























