New Parliament Building: భారత దేశ చట్టసభలో నవ శకం.. ముగిసిన మొదటి దశ నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ వేడుక..
సనాతన ధర్మం ఉట్టిపడేలా, అత్యాధునిక హంగులతో నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఉదయం కొత్త పార్లమెంట్ ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని మోదీకి లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా స్వాగతం పలికారు. ఇద్దరు కలిసి నడుస్తూ పార్లమెంట్ పరిసరాలను పరిశీలించారు. సరిగ్గా ఉదయం 7.15 గంటలకు హోమం, పూజా కార్యక్రమాల్లో మోదీతో పాటు స్పీకర్ ఓంబిర్లా పాల్గొన్నారు. అంతకుముందు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహానికి మోదీ నివాళులు అర్పించారు.
భారత దేశ చట్టసభలో నవ శకంగా నిలవనున్న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త పార్లమెంట్.. దేశ అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. ఓ మహా కట్టడాన్ని నిర్మించడమే కాకుండా.. అందులో అడుగడుగునా భారతీయత ఉట్టిపడేలా చేశారు. దేశ రాజధాని నడిబొడ్డున అధునాతన సదుపాయాలు, సకల హంగులతో నిర్మించిన నూతన పార్లమెంటు భవంతిని ప్రధాని మోదీ ప్రారంభించారు. కొత్త పార్లమెంట్‌ని జాతికి అంకితం చేశారు. ఆదివారం ఉదయం 7:30 గంటలకు కొత్త పార్లమెంట్ భవనానికి చేరుకున్న ప్రధాని మోదీకి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్వాగతం పలికారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి మోదీ నివాళులు అర్పించారు. ఆత్మనిర్భరతకు ప్రతీకగా నిలవనున్న ఈ అధునాతన పార్లమెంటు భవంతి వద్ద ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో భాగంగా తొలుత గణపతి హోమం నిర్వహించారు. పూజ తర్వాత రాజదండం సెంగోల్‌కు మోదీ సాష్టాంగ సమస్కారం చేశారు.
ఈ పూజ కార్యక్రమాల్లో మోదీతో పాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పాల్గొన్నారు. ఆ తర్వాత సెంగోల్‌ను లోక్‌సభలో మోదీ ప్రతిష్ఠించారు. ఆ తర్వాత పార్లమెంటు భవన నిర్మాణ కార్మికులను సత్కరించి.. వారికి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం పార్లమెంటు సౌధాన్ని ప్రారంభించారు. అనంతరం సర్వమత పార్థనలు నిర్వహించారు. పార్లమెంటు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.
ముందుగా హోమం అనంతరం రాజదండానికి ప్రధాని సాస్టాంగ నమస్కారం చేశారు. ఆ తర్వాత రాజదండాన్ని మోదీకి అందించారు వేద పండితులు. సెంగోల్‌ను స్వీకరించి.. వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు మోదీ. అనంతరం లోక్‌సభ స్పీకర్ సీటు పక్కన సెంగోల్‌ను ప్రతిష్టించారు.
1200 కోట్ల రూపాయలతో కొత్త పార్లమెంట్ భవనం రూపుదిద్దుకుంది. ఈ నిర్మాణంలో దాదాపు 6 వేల మంది కార్మికులు పాలుపంచుకున్నారు. వారిని ఘనంగా సన్మానించారు మోదీ. శాలువా కప్పి ఙ్ఞాపికలను అందించారు. అనంతరం పార్లమెంట్ ఆవరణలో సర్వమత ప్రార్థనలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం