Parliament: ప్రారంభమైన కొత్త పార్లమెంట్ భవనం.. మరి పాత భవనాన్ని ఏం చేయనున్నారో తెలుసా?
అంగరంగ వైభవంగా కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం జరిగింది. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకింతం చేశారు. అధునాతన సదుపాయాలు, సకల హంగులతో నిర్మించిన కొత్త పార్లమెంట్ ప్రధాన ద్వారం నుంచి పార్లమెంటు ఆవరణలోకి ప్రవేశించిన ప్రధానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్వాగతం పలికారు...
అంగరంగ వైభవంగా కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం జరిగింది. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకింతం చేశారు. అధునాతన సదుపాయాలు, సకల హంగులతో నిర్మించిన కొత్త పార్లమెంట్ ప్రధాన ద్వారం నుంచి పార్లమెంటు ఆవరణలోకి ప్రవేశించిన ప్రధానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్వాగతం పలికారు. అనంతరం గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఇదిలా ఉంటే కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా సహజంగానే ప్రతీ ఒక్కరిలో ఒక ప్రశ్న ఎదురవుతుంది. అదే పార్లమెంట్ భవనాన్ని ఏం చేస్తారు.? అసలు కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించడానికి కారణం ఏంటి.? పాత భవనానికి కొత్త భవనానికి ఉన్న తేడాలు ఏంటి.? పాత పార్లమెంట్ భవనాన్ని ఏం చేయనున్నారు.? లాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పాత లోక్‌సభలో గరిష్టంగా 552 మందికి కూర్చునే అవకాశం ఉండేది కానీ కొత్త లోక్‌సభ భవనం 888 సీట్ల సామర్థ్యం కలిగి ఉంది. ఇక పాత రాజ్యసభ భవనంలో 250 మంది సభ్యులు కూర్చునే సామర్థ్యం ఉండగా, కొత్త రాజ్యసభ హాలు సామర్థ్యం 384కి పెరిగింది. కొత్త భవనంలో ఎంపీలందరికీ వేర్వేరుగా కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. కొత్త పార్లమెంట్ భవనంలో భారత రాజ్యాంగం అసలు ప్రతిని ఏర్పాటు చేస్తారు. కొత్త పార్లమెంట్ వైశాల్యం ప్రస్తుత పార్లమెంట్ భవనం కంటే 17,000 చదరపు మీటర్లు ఎక్కువ కావడం విశేషం.
ఇంతకీ పాత భవనాన్ని ఏం చేయనున్నారు.?
కొత్త భవనం ప్రారంభం జరిగిన క్రమంలో పాత భవనాన్ని ఏం చేస్తారన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. పాత పార్లమెంట్ భవనాన్ని కూల్చేస్తారా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే పాత పార్లమెంట్ భవనాన్ని పార్లమెంటరీ కార్యక్రమాలకు వినయోగించుకోనున్నట్లు అధికారులు తెలిపారు. భవనాన్ని కూల్చడం లాంటివి చేయరని తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే పాత పార్లమెంట్ భవనాన్ని బ్రిటీష్ వాస్తుశిల్పులు సర్ ఎడ్విన్ లుటియన్స్, హెర్బర్ట్ బేకర్ ‘కౌన్సిల్ హౌస్’గా రూపొందించారు. అప్పలో దీని నిర్మాణానికి రూ. 83 లక్షలు ఖర్చు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..