అయ్యయ్యో.. ఈ దొంగకొచ్చిన కష్టం మరెవ్వరికీరాకూడదు.. కాపాడండంటూ పోలీసుల ఎదుట గగ్గోలు

రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న మహిళ మెడలో గోల్డ్‌ చైన్‌ను ఇద్దరు దొంగలు లక్కెళ్లారు. బాధితురాలు దొంగా.. దొంగా అని అరవడంతో సమీపంలో ఉన్న పోలీసులు దొంగల వెంటబడ్డారు. కొన్ని గంటల పాటు ముప్పుతిప్పలు పెట్టినప్పటికీ చివరికి దొంగలను ఖాఖీలు..

అయ్యయ్యో.. ఈ దొంగకొచ్చిన కష్టం మరెవ్వరికీరాకూడదు.. కాపాడండంటూ పోలీసుల ఎదుట గగ్గోలు
Thief Swallows Gold Chain
Follow us
Srilakshmi C

|

Updated on: May 28, 2023 | 2:48 PM

రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న మహిళ మెడలో గోల్డ్‌ చైన్‌ను ఇద్దరు దొంగలు లక్కెళ్లారు. బాధితురాలు దొంగా.. దొంగా అని అరవడంతో సమీపంలో ఉన్న పోలీసులు దొంగల వెంటబడ్డారు. కొన్ని గంటల పాటు ముప్పుతిప్పలు పెట్టినప్పటికీ చివరికి దొంగలను ఖాఖీలు పట్టుకున్నారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

జార్ఖంగ్‌ రాష్ట్రం రాంచీలోని దిబ్దిహ్ వంతెన సమీపంలో రోడ్డుపై వెళ్తున్న మహిళ మెళ్లోని గోల్డ్‌ చైన్‌ను రాంచి సల్మాన్​, జాఫర్​ అనే ఇద్దరు చైన్ స్నాచర్లు బైక్‌పై వచ్చి లాక్కెళ్లారు. బాధితురాలు అరవడం మొదలుపెట్టింది. ఆమె అరుపులు విన్న పోలీసులు నిందితుల బైక్‌ను వెంబడించారు. గంటల వ్యవధిలోనే ఛేజ్ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇంతలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు దొంగిలించిన బంగారు గొలుసును సల్మాన్ మింగేశాడు. దీంతో పోలీసులు అతన్ని రిమ్స్​ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఎక్స్​రే తీయగా.. గోల్డ్‌ చైన్‌ సల్మాన్‌ ఛాతీ భాగంలో ఇరుక్కుపోయినట్లు వైద్యులు తెలిపారు. వెంటనే ఆపరేషన్‌ చేయడాలని, లేదంటే ఇన్​ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉందని వెల్లడించారు. మింగిలన చైన్‌ ఎలాగోలా బయటికి వస్తుందిలే అనుకుంటే.. ఏకంగా ప్రాణం మీదికి రావడంతో సల్మాన్‌ లబోదిబోమన్నాడు. తనను కాపాడాలని వైద్యులు, పోలీసులను వేడుకున్నాడు.

కాగా సల్మాన్, జాఫర్ గత 2 నెలలుగా రాంచీలో పలు దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఒంటరిగా వెళ్తున్న మహిళలే టార్గెట్​గా వీరు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. వీరు దొంగతనానికి వాడిన బైక్ కూడా చోరీ చేసిందనేని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.