AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Parliament Inauguration: ‘మీ ఆలోచనలను బాగా వెల్లడించారు’.. స్టార్‌ హీరోలకు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోడీ

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై దేశ వ్యాప్తంగా నేతలు, ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే పలువుర ఉస్టార్‌ హీరోలు నూతన పార్లమెంట్ గొప్పతనాన్ని ప్రశంసించారు. ప్రధాని మోడీ పని తీరును మెచ్చుకుంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు.

New Parliament Inauguration: 'మీ ఆలోచనలను బాగా వెల్లడించారు'.. స్టార్‌ హీరోలకు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోడీ
PM Modi, Rajinikanth, Shah Rukh Khan, Akshay Kumar,
Basha Shek
|

Updated on: May 28, 2023 | 1:54 PM

Share

భారత దేశ చట్టసభలో నవ శకంగా నిలవనున్న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరుగుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త పార్లమెంట్ భవంతిని ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం దానిని జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఈ కార్యక్రమానికి ప్రధానితో సహా పలువురు కేంద్రమంత్రులు, పలు పార్టీల నాయకులు హాజరయ్యారు. ఇక కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై దేశ వ్యాప్తంగా నేతలు, ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే పలువుర ఉస్టార్‌ హీరోలు నూతన పార్లమెంట్ గొప్పతనాన్ని ప్రశంసించారు. ప్రధాని మోడీ పని తీరును మెచ్చుకుంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొత్త పార్లమెంట్ భవనాన్ని కొనియాడారు. ఇందుకు తన ట్విట్టర్ వేదికగా.. కొత్త పార్లమెంట్ భవనాన్ని పూర్తిగా చూపించే వీడియోను షేర్ చేశారు. ‘మన రాజ్యాంగాన్ని సమర్థించే, ఈ గొప్ప దేశంలోని ప్రతి పౌరుడికి ప్రాతినిధ్యం వహించే, రక్షించే వ్యక్తులకు ఎంత అద్భుతమైన కొత్త ఇల్లు. .. గ్లోరీ ఫర్ ఇండియా ఏజ్ ఓల్డ్ డ్రీమ్ . అలాగే ఇది మన ‘నవ భారతదేశం కోసం’ అని ఆ వీడియోలో రాసుకొచ్చారు షారుఖ్‌. దీనికి స్పందించిన ప్రధాని మోడీ ‘చాలా అందంగా చెప్పారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రజాస్వామ్య శక్తికి, ప్రగతికి ప్రతీక. ఇది ఆధునికతతో సంప్రదాయాన్ని సమ్మిళితం చేస్తుంది’ అంటూ #MyParliamentMyPride అనే హ్యాష్‌ ట్యాగ్‌ను జోడించారు మోడీ.

ప్రజాస్వామ్యానికి నిజమైన దిక్సూచి..

ఇవి కూడా చదవండి

ఇక పార్లమెంటు నూతన భవనాన్ని చూడటం గర్వకారణమని అక్షయ్ కుమార్ ప్రశంసించారు. దేశ అభివృద్ధికి విశిష్ట చిహ్నంగా ఇది ఎల్లప్పుడూ నిలవాలని ఆయన ఆకాంక్షించారు. అక్షయ్ కుమార్ ట్వీట్‌ను నరేంద్ర మోదీ రీట్వీట్ చేస్తూ.. ‘మీ ఆలోచనలను చాలా బాగా వెల్లడించారు’ అని ప్రశంసించారు. నూతన పార్లమెంటు భవనం మన ప్రజాస్వామ్యానికి నిజమైన దిక్సూచి అని మోడీ తెలిపారు.

దేశం మొత్తం గర్విస్తోంది..

ఇక తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై స్పందించారు. సెంగోల్‌ను తమిళ శక్తికి ప్రతీకగా అభివర్ణించిన సూపర్‌ స్టార్‌ ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ‘తమిళ శక్తికి సాంప్రదాయ చిహ్నం సెంగోల్. ఇది ఇప్పుడు కొత్త పార్లమెంటులో మరింత ప్రకాశిస్తుంది. ఈ సందర్భంగా తమిళులు గర్వపడేలా చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి హృదయపూర్వక ధన్యవాదాలు’ అని ట్వీట్‌ చేశారు రజనీకాంత్‌. దీనికి స్పందించిన మోడీ రజనీకాంత్‌ కు ధన్యవాదాలు తెలిపారు. ‘తమిళనాడు అద్భుతమైన సంస్కృతి ని చూసి దేశం మొత్తం గర్విస్తోందన్నారు. అలాగే కొత్త పార్లమెంట్ భవనంలో తమిళనాడు రాష్ట్ర సంస్కృతిని చూడడం ఎంతో గర్వంగా ఉందంటూ రిప్లై ఇచ్చారు ప్రధాని మోడీ.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..