Malli Pelli: ఆ ఒటీటీలోనే రానున్న నరేష్‌, పవిత్ర లోకేశ్‌ల ‘మళ్లీ పెళ్లి’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

సీనియర్‌ నటీ నటులు నరేశ్‌, పవిత్ర లోకేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మళ్లీ పెళ్లి. నరేశ్‌, పవిత్రల నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని ప్రముఖ దర్శక నిర్మాత ఎమ్మెస్‌ రాజు ఈ సినిమాను తెరకెక్కించారు. విజయకృష్ణ మూవీస్‌ బ్యానర్‌పై వీకే నరేశ్‌ స్వయంగా ఈ సినిమాను నిర్మించాడు.

Malli Pelli: ఆ ఒటీటీలోనే రానున్న నరేష్‌, పవిత్ర లోకేశ్‌ల 'మళ్లీ పెళ్లి'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Malli Pelli Movie
Follow us
Basha Shek

|

Updated on: May 27, 2023 | 8:27 PM

సీనియర్‌ నటీ నటులు నరేశ్‌, పవిత్ర లోకేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మళ్లీ పెళ్లి. నరేశ్‌, పవిత్రల నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని ప్రముఖ దర్శక నిర్మాత ఎమ్మెస్‌ రాజు ఈ సినిమాను తెరకెక్కించారు. విజయకృష్ణ మూవీస్‌ బ్యానర్‌పై వీకే నరేశ్‌ స్వయంగా ఈ సినిమాను నిర్మించాడు. శుక్రవారం (మే26)న విడుదలైన మళ్లీ పెళ్లి సినిమాకు మిక్స్‌ డ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. అయితే రిలీజ్‌కు ముందు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ గట్టిగా ప్రమోషన్లు నిర్వహించడంతో ఓ మోస్తరుగానే కలెక్షన్లు వచ్చాయి. మొదటి రోజు దాదాపు రూ.30 లక్షల వరకు వసూళ్లు రాబట్టిందని సమాచారం. కాగా ఈ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సొంతం చేసుకుంది. అయితే రిలీజ్‌ డేంట్‌ మాత్రం ఇంకా ఫైనలేజ్‌ కాలేదు. థియేటర్లలో వచ్చే రెస్పాన్స్‌ను బట్టి ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసే అవకాశముందని తెలుస్తుంది.

కాగా తెలుగుతో పాటు కన్నడలోనూ మళ్లీ పెళ్లి సినిమాను విడుదల చేశారు. పవిత్రా లోకేశ్‌ కన్నడ నటి కాబట్టే ఈ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకోవాలని దర్శక నిర్మాతలు భావించి కన్నడ నాట కూడా భారీగానే రిలీజ్‌ చేశారు. ఇక ఈ సినిమాలో వనితా విజయ్‌ కుమార్‌ ఓ కీలక పాత్రలో నటించారు. అలాగే ఇటీవల మరణించిన శరత్‌బాబు కృష్ణ పాత్రలో చివరిసారిగా వెండితెరపై కనిపించారు. అలాగే అన్నపూర్ణ, భద్రం తదితరలు మెరిశారు. ఇక సినిమా మొత్తం నరేశ్‌, పవిత్ర, వనితా విజయ్‌కుమార్‌ల చుట్టే తిరుగుతుంటుంది. అరుళ్‌దేవ్‌, సురేష్‌ బొబ్బి ఈ సినిమాకు స్వరాలు సమకూర్చగా, జునైద్‌ సిద్ధిఖీ ఎడిటర్‌గా వ్యవహరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..