Bichagadu 2: విజయ్ ఆంటోని ‘బిచ్చగాడు 2’ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
బిచ్చగాడు 2 సినిమాతో చాలా కాలం తర్వాత హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు విజయ్ ఆంటోని. కొన్నేళ్ల క్రితం వచ్చిన బిచ్చగాడు సినిమాకు ఇది సీక్వెల్. మే 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన బిచ్చగాడు 2 సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతోంది. తమిళంలో కంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి ఎక్కువగా కలెక్షన్లు వస్తుండడం విశేషం.
బిచ్చగాడు 2 సినిమాతో చాలా కాలం తర్వాత హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు విజయ్ ఆంటోని. కొన్నేళ్ల క్రితం వచ్చిన బిచ్చగాడు సినిమాకు ఇది సీక్వెల్. మే 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన బిచ్చగాడు 2 సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతోంది. తమిళంలో కంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి ఎక్కువగా కలెక్షన్లు వస్తుండడం విశేషం. అందుకే తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాల్లో పర్యటిస్తూ తన సినిమాను మరింత ప్రమోట్ చేసుకుంటున్నాడు. కాగా సక్సెస్‌ఫుల్‌గా రెండో వారంలోకి అడుగుపెట్టిన బిచ్చగాడు 2 మూవీ ఓటీటీ రిలీజ్ కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ ఆంటోని మూవీ స్ట్రీమింగ్ డీటెయిల్స్ గురించి సామాజిక మాధ్యమాల్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం జూన్ మూడో వారంలో బిచ్చగాడు 2 స్ట్రీమింగ్‌కు రానున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది.
థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోన్న బిచ్చగాడు 2 మూవీ జూన్ మూడో వారంలో ఓటీటీలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఒకేసారి స్ట్రీమింగ్‌కు రానుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో కావ్యా థాపర్ హీరోయిన్‌గా నటించింది. హీరో విజయ్ ఆంటోనీనే దర్శకత్వ, సంగీత బాధ్యతలు నిర్వర్తించాడు. విజయ్ ఆంటోనీ సతీమణి ఫాతిమా ఆంటోనీ నిర్మాతగా వ్యవహరించారు.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.