- Telugu News Photo Gallery Cinema photos Jawan movie director Atlee Kumar and wife Priya attend Cannes Film Festival 2023 Red carpet
Cannes Film Festival: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసిన స్టార్ డైరెక్టర్.. భార్యతో కలిసి రెడ్ కార్పెట్‌పై సందడి చేసిన అట్లీ
ఇదిలా ఉంటే అట్లీ కుమార్ తాజాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేశాడు అట్లీ. తన భార్య ప్రియతో కలిసి రెడ్ కార్పెట్‌పై నడిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ప్రతిష్టాత్మక చిత్రోత్సవంలో అట్లీ పాల్గొనడం ఇదే తొలిసారి. దీంతో అందరూ ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.
Updated on: May 27, 2023 | 9:58 PM

భారతీయ చిత్ర పరిశ్రమలో అట్లీ కుమార్‌కి ప్రస్తుతం డిమాండ్ ఉంది. కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన అతను ఇప్పుడు 'జవాన్' సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టాడు.

ఇదిలా ఉంటే అట్లీ కుమార్ తాజాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేశాడు. తన భార్య ప్రియతో కలిసి రెడ్ కార్పెట్‌పై నడిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ప్రతిష్టాత్మక చిత్రోత్సవంలో అట్లీ పాల్గొనడం ఇదే తొలిసారి. దీంతో అందరూ ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సెలబ్రిటీలు రెడ్ కార్పెట్‌పై నడవడం ప్రత్యేక ఆకర్షణ. అట్లీ కుమార్- ప్రియ దంపతులు కూడా రెడ్ కార్పెట్ మీద నడిచి మీడియా కెమెరాలకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఫోటోలు వైరల్‌గా మారాయి. చూడముచ్చటైన జంట అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

తమిళంలో 'రాజా రాణి', 'మెర్సెల్', 'బిగిల్' వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు అట్లీ కుమార్. ఎన్నో అవార్డులు అందుకున్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనడం వల్ల అతని పాపులారిటీ మరింత పెరిగింది.

షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రానికి అట్లీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై చాలా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. నయనతార ఈ సినిమాలో హీరోయిన్‌గా కనిపించనుంది.




