Telugu Indian Idol 2: యంగ్ సింగర్ల ట్యాలెంట్ కు అల్లు అర్జున్‌ ఫిదా.. గిఫ్ట్‌గా ఏమేమిచ్చాడో తెలుసా? వీడియో వైరల్

యువ సంగీత కళాకారులకు తమ ట్యాలెంట్‌ను నిరూపించుకునేందుక చక్కని వేదికగా నిలిచింది 'తెలుగు ఇండియన్‌ ఐడల్‌'. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోన్న ఈ ట్యాలెంట్‌ హంట్‌ షో ఇప్పటికే ఫస్ట్‌ సీజన్‌ను సక్సెస్‌ ఫుల్‌గా కంప్లీట్‌ చేసుకుంది. ఇక రెండో సీజన్‌ కూడా తుది అంకానికి చేరుకుంది.

Telugu Indian Idol 2: యంగ్ సింగర్ల ట్యాలెంట్ కు అల్లు అర్జున్‌ ఫిదా.. గిఫ్ట్‌గా ఏమేమిచ్చాడో తెలుసా? వీడియో వైరల్
Telugu Indian Idol2
Follow us
Basha Shek

|

Updated on: May 28, 2023 | 1:14 PM

యువ సంగీత కళాకారులకు తమ ట్యాలెంట్‌ను నిరూపించుకునేందుక చక్కని వేదికగా నిలిచింది ‘తెలుగు ఇండియన్‌ ఐడల్‌’. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోన్న ఈ ట్యాలెంట్‌ హంట్‌ షో ఇప్పటికే ఫస్ట్‌ సీజన్‌ను సక్సెస్‌ ఫుల్‌గా కంప్లీట్‌ చేసుకుంది. ఇక రెండో సీజన్‌ కూడా తుది అంకానికి చేరుకుంది. రెండో సీజన్‌లో మొత్తం 25 ఎపిసోడ్లకు గానూ 10,000 మంది యువ సింగర్స్‌ తమ అదృష్టం పరీక్షించుకోగా మొత్తం ఐదుగురు ఫినాలే పోటీలకు చేరుకున్నారు. న్యూజెర్సీకి చెందిన శ్రుతి నండూరి, హైదరాబాద్‌కు చెందిన జయరామ్, సిద్దిపేటకు చెందిన లాస్య ప్రియ, హైదరాబాద్‌కు చెందిన కార్తికేయ, విశాఖపట్నంకు చెందిన సౌజన్య టైటిల్‌ బరిలో నిలిచిన వారిలో ఉన్నారు. ఇక ఫినాలే ఎపిసోడ్‌కు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫినాలే ఎపిసోడ్‌కు సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్‌ ఇస్తోన్న ఆహా మేనేజ్‌మెంట్‌ తాజాగా ఫినాలే ఎపిసోడ్‌ ప్రోమోను రిలీజ్‌ చేసింది. ఈ సందర్భంగా విడుదలైన వీడియో అందరినీ ఆకట్టుకుంది. ఇందేలె సింగర్స్‌ పాటలకు ఫిదా అయిన బన్నీ వారిని అభినందించారు. మొదటగా సింగర్‌ శ్రుతి నండూరి ఆలపించిన ‘ఇరగా.. ఇరగా’ పాటను మెచ్చుకున్న ఆయన యంగ్ సింగర్‌కు ‘AA (అల్లు అర్జున్‌)’ పేరుతో కూడిన ఓ లాకెట్‌ను కానుకగా అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ‘ మీ పేరంటే నాకెంతో ఇష్టం. ఎందుకంటే నా ఫస్ట్ గర్ల్‌ఫ్రెండ్‌ది కూడా అదే పేరు’’ అని చెప్పి సిగ్గుపడిపోయారు బన్నీ.

ఇక ఇతర కంటెస్టెంట్లకు కూడా అభినందించిన బన్నీ వారికి కూడా బహుమతులు అందజేశారు. ఇక మధ్యలో షోకు వచ్చేసి ఆకట్టుకున్నాడు ‘సత్తిగాని రెండెకరాలు ఫేమ్‌’ జగదీష్‌ ప్రతాఫ్‌ భండారి. కాగా మునుపెన్నడూ చూడని విధంగా స్టైలిష్ లుక్‌లో ఆహా తెలుగు ఇండియన్‌ ఐడల్‌ షోకు హాజరయ్యారు అల్లు అర్జున్‌. ఈ సందర్భంగా కంటెస్టెంట్లు, షో జడ్జీలు పుష్పరాజ్‌కు ఘన స్వాగతం పలికారు. మొత్తానికి ఫినాలె ఎపిసోడ్‌ ఎంతో ఆహ్లాదకరంగా సాగినట్లు ఈ ప్రోమోను చూస్తే తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..