Ashish Vidyarthi: ఆశిష్ విద్యార్థి పెళ్లి చేసుకున్న రూపాలి ఎవరు.? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..?

ఆశిష్ విద్యార్థిని తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయన ఎన్నో సినిమాలతో ద్వారా మనకు సుపరిచితుడు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో నటించాడు. ముఖ్యంగా పోకిరి సినిమాలో విలన్‌గా అతడి నటన నెక్ట్స్ లెవల్‌లో క్లిక్ అయ్యింది

Ashish Vidyarthi: ఆశిష్ విద్యార్థి పెళ్లి చేసుకున్న రూపాలి ఎవరు.? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..?
Rupali
Follow us

|

Updated on: May 28, 2023 | 12:48 PM

ప్రేమకు , పెళ్లి వయసుతో సంబంధం లేదు అని ఇప్పటికే చాలా మంది నిరూపించారు. సినిమా తారలు చాలా మంది లేటు వయసులో పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఆశిష్ విద్యార్థిని తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయన ఎన్నో సినిమాలతో ద్వారా మనకు సుపరిచితుడు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో నటించాడు. ముఖ్యంగా పోకిరి సినిమాలో విలన్‌గా అతడి నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. గతంలో ఎక్కువ విలర్ రోల్స్ చేసిన ఈ యాక్టర్.. ఇప్పుడు ఫాదర్ తరహా రోల్స్ చేస్తున్నారు. తాజాగా 60 ఏళ్ల వయస్సులో ఈయన సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం.. అటు నార్త్ ఇండస్ట్రీ, ఇటు సౌత్ ఇండస్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. అస్సాంకు చెందిన ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్ రూపాలి బారువాను గురువారం( మే 25న) కోల్‌కతా క్లబ్‌లో ఆశిష్ విద్యార్థి పెళ్లాడారు.

అయితే ఆశిష్ విద్యార్థి పెళ్లాడిన రూపాలి ఎవరు.? ఆమె అసలు ఏం చేస్తుంటారు.? రూపాలీ బరువ గౌహతి కి చెందిన మహిళ. ఈమెకు కోల్ కత్తా లోని ఒక ఫ్యాషన్ స్టోర్ ఉన్నట్లుగా తెలుస్తుంది. 1973లో జన్మించిన రూపాలి గౌహతిలోని సెయింట్ మేరీస్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చదువుకున్నారు. అలాగే గౌహతిలోని కాటన్ విశ్వవిద్యాలయం నుంచి ఆంత్రోపాలజీలో గ్రాడ్యుయేషన్‌ చేసింది. రూపాలి గౌహతి విశ్వవిద్యాలయం నుంచి ఆంత్రోపాలజీలో మాస్టర్స్ డిగ్రీని పొందింది. ఆమె ప్రస్తుతం కోల్‌కతాలో తన సొంత ఫ్యాషన్ కంపెనీని నడుపుతోంది.

రూపాలి గతంలో డాక్టర్ అయిన మితమ్ బరూహ్‌ను వివాహం చేసుకుంది. ఆ సమయంలో ఆమె విదేశాల్లో సెటిల్ అయ్యారు. రూపాలి, మితమ్ దంపతులకు ఒక కుమార్తె ఉంది. ఇక రూపాలి తన మొదటి భర్త మరణం తర్వాత విదేశాలనుంచి  భారతదేశానికి మారింది. ఇక ఇప్పుడు ఆశిష్ విద్యార్థిని వివాహమాడి హాట్ టాపిక్ గా మారారు. తాజాగా పెళ్లి చేసుకున్న ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.