Ram Charan: రామ్ చరణ్ నయా బ్యానర్‌లో మొదటి సినిమా.. అదిరిపోయిన గ్లింప్స్

ఇప్పటికే కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినిమాలు తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో బ్యానర్ ను ప్రారంభించారు. ఒక వైపు హీరోగా రాణిస్తూనే.. మరో వైపు నిర్మాతగా సినిమాలను రూపొందిస్తున్నారు మెగా పవర్ స్టార్.

Ram Charan: రామ్ చరణ్ నయా బ్యానర్‌లో మొదటి సినిమా.. అదిరిపోయిన గ్లింప్స్
Ram Charan, Nikhil
Follow us

|

Updated on: May 28, 2023 | 12:11 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త ప్రొడక్షన్ బ్యానర్‌ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై చెర్రీ సినిమాలు తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో బ్యానర్ ను ప్రారంభించారు మెగా పవర్ స్టార్. ఒక వైపు హీరోగా రాణిస్తూనే.. మరో వైపు నిర్మాతగా సినిమాలను రూపొందిస్తున్నారు మెగా పవర్ స్టార్. తాజాగా రామ్ చరణ్, ప్రొడ్యుసర్ విక్రమ్ రెడ్డి కలిసి ‘వి మెగా పిచర్స్’ అనే బ్యానర్‌ని లాంచ్ చేశారు. ఈ నిర్మాణ సంస్థలో కొత్త ట్యాలెంట్‌ని ప్రోత్సాహిస్తూ పాన్ ఇండియా స్థాయిలో చిత్రాలు నిర్మించాలనేది ప్లాన్. ఈ క్రమంలోనే వి మెగా పిచర్స్ యంగ్ హీరో నిఖిల్ తో కలిసి సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ది ఇండియా హౌస్ అనే టైటిల్ తో సినిమా తెరకెక్కిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ వీడియో చూస్తుంటే ది ఇండియా హౌస్ సినిమాను పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారని అర్ధమవుతోంది. స్వతంత్ర సమరం కాలం నాటి కథతో ఈ సినిమా రూపొందుతుందని అర్ధమవుతోంది.

కార్తికేయ-2, 18 పేజెస్ సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న నిఖిల్ ఫుల్ జోష్ మీద ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు స్పై అనే సినిమా చేస్తున్నాడు. దాంతో పాటుగా రామ్ చరణ్ నయా బ్యానర్ లో ది ఇండియా హౌస్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. ఈ మూవీ ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ పై మీరూ ఓ లుక్కేయండి.