OTT Movies: ఓటీటీ లవర్స్‌కు అదిరిపోయే ఆఫర్‌.. సబ్‌స్క్రిప్షన్‌ లేకపోయినా ఈ కొత్త సినిమాలు చూడొచ్చు

గతంలో పోలీస్తే ఇప్పుడు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. చాలామంది ఓటీటీల బాట పడుతున్నారు. అందుకు తగ్గట్టే అన్ని ఓటీటీల ప్లాట్‌ఫామ్స్‌ సరికొత్త కంటెంట్‌తో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లకు రిలీజ్‌ చేస్తున్నాయి. అయితే వీటిని చూడాలంటే కచ్చితంగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ ఉండాల్సిందే.

OTT Movies: ఓటీటీ లవర్స్‌కు అదిరిపోయే ఆఫర్‌.. సబ్‌స్క్రిప్షన్‌ లేకపోయినా ఈ కొత్త సినిమాలు చూడొచ్చు
Ott Movies
Follow us
Basha Shek

|

Updated on: May 27, 2023 | 6:04 PM

గతంలో పోలీస్తే ఇప్పుడు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. చాలామంది ఓటీటీల బాట పడుతున్నారు. అందుకు తగ్గట్టే అన్ని ఓటీటీల ప్లాట్‌ఫామ్స్‌ సరికొత్త కంటెంట్‌తో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లకు రిలీజ్‌ చేస్తున్నాయి. అయితే వీటిని చూడాలంటే కచ్చితంగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ ఉండాల్సిందే. అయితే మనలో చాలామందికి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్ ఉండవు. దీంతో కొత్త సినిమాలు చూడడానికి చాలామంది పైరసీ సైట్స్‌ను ఆశ్రయిస్తుంటారు. అయితే అందులో ఒరిజిన్‌గా చూసిన ఫీలింగ్‌ ఉండదు. క్వాలిటీ పరంగా కూడా చాలా తేడా ఉంటుంది. అలా కాకుండా ఓటీటీల్లోనే సబ్‌ స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా సినిమాలు చూసే అవకాశం వస్తే.. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ జియో సినిమా అలాంటి బంపరాఫర్‌నే ప్రకటించింది. యూజర్లను ఆకట్టుకునే పనిలో భాగంగా సబ్‌ స్క్రిప్షన్ అవకాశం లేకుండా కొత్త సినిమాలు చూసే అవకాశం కల్పించింది. అంటే లాగిన్ ఏం అవసరం లేకుండా జస్ట్‌ ప్లే స్టోర్ లో సదరు యాప్ ని ఇన్ స్టాల్ చేసుకుంటే సినిమాలు చూసేయొచ్చు.

ఇదిలా ఉంటే ఐపీఎల్‌ స్ట్రీమింగ్‌లో దూసుకెళుతోన్న జియో సినిమా తెలుగు కంటెంట్‌పై కూడా దృష్టి సారించింది. అందులో భాగంగా రీసెంట్‌లో తమ యాప్‌లో విడుదలైన విక్రమ్‌ వేద, భేడియా (తెలుగులో తోడేలు), కచ్చి లింబు లాంటి హిందీ మూవీస్‌తో పాటు ‘కోనసీమ థగ్స్‌’, ‘బూ’ తదితర సినిమాలను ఉచితంగా చూసే అవకాశం కల్పించింది. కాగా ఇటీవల ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా కూడా ఇలాంటి ఆఫర్‌నే ప్రకటించింది. కలర్ ఫోటో, క్రాక్, మసూద, డీజే టిల్లు చిత్రాల్ని తలా ఓ రోజు ఫ్రీగా స్ట్రీమింగ్ చేసింది. అయితే, ఏ రోజు ఏ సినిమా ఉచితంగా చూడొచ్చు అనే విషయాన్ని ఆహా తన ట్విటర్‌ ఖాతా వేదికగా ఉదయాన్నే అప్‌డేట్‌ ఇస్తుంది. ఇక బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘అన్‌స్టాపబుల్‌’ కార్యక్రమం ప్రభాస్‌ ఎపిసోడ్‌ను శనివారం ఉచితంగా చూడొచ్చు. అలాగే జీ5 ఓటీటీ కూడా కల్యాణ్‌ రామ్‌ బింబిసార తొలి 15 నిమిషాలు ఉచితంగా చూసే అవకాశమిచ్చింది. పూర్తిగా చూడాలంటే మాత్రం సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

న్యూ ఇయర్ వెకేషన్‌కు ప్లాన్ చేశారా.. ఈ టిప్స్ పాటించడం మస్ట్..!
న్యూ ఇయర్ వెకేషన్‌కు ప్లాన్ చేశారా.. ఈ టిప్స్ పాటించడం మస్ట్..!
వివాదంలో చిక్కుకున్న ఎంఎస్ ధోని.. జార్ఖండ్ ప్రభుత్వం సీరియస్
వివాదంలో చిక్కుకున్న ఎంఎస్ ధోని.. జార్ఖండ్ ప్రభుత్వం సీరియస్
డాకూ మహరాజ్ ప్రెస్ మీట్..! శంబాల ఫస్ట్ లుక్ రిలీజ్..
డాకూ మహరాజ్ ప్రెస్ మీట్..! శంబాల ఫస్ట్ లుక్ రిలీజ్..
కృష్ణుడి గోపికలుగా అక్కాచెల్లెళ్లు.. ఎవరో గుర్తు పట్టారా?
కృష్ణుడి గోపికలుగా అక్కాచెల్లెళ్లు.. ఎవరో గుర్తు పట్టారా?
రూ.6 లక్షల విలువైన పాత కారును లక్షకు అమ్మితే రూ.90 వేల జీఎస్టీ
రూ.6 లక్షల విలువైన పాత కారును లక్షకు అమ్మితే రూ.90 వేల జీఎస్టీ
గుడ్లను వీటితో కలిపి తింటే డేంజర్ బెల్స్ మోగినట్లే.. జాగ్రత్త!
గుడ్లను వీటితో కలిపి తింటే డేంజర్ బెల్స్ మోగినట్లే.. జాగ్రత్త!
టీమిండియా స్టార్ పేసర్ బౌలింగ్ యాక్షన్‌పై ఆరోపణలు
టీమిండియా స్టార్ పేసర్ బౌలింగ్ యాక్షన్‌పై ఆరోపణలు
రేపు, ఎల్లుండి శబరిమల అయ్యప్ప దర్శనాల సంఖ్య తగ్గింపు.. ఎందుకంటే
రేపు, ఎల్లుండి శబరిమల అయ్యప్ప దర్శనాల సంఖ్య తగ్గింపు.. ఎందుకంటే
కావ్య ఆర్డర్స్‌కి రుద్రాణి, ధాన్యలక్ష్మి హడల్.. రాజ్ సపోర్ట్!
కావ్య ఆర్డర్స్‌కి రుద్రాణి, ధాన్యలక్ష్మి హడల్.. రాజ్ సపోర్ట్!
10 రోజుల వ్యవధిలో ముగ్గురు స్టూడెంట్స్ అదృశ్యం
10 రోజుల వ్యవధిలో ముగ్గురు స్టూడెంట్స్ అదృశ్యం