PM Modi: రూ.75 నాణేన్ని విడుదల చేసిన ప్రధాని మోదీ.. నాణేం ప్రత్యేకతలేంటంటే
అత్యాధునిక హంగులతో నిర్మించిన నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రధాన ద్వారం నుంచి పార్లమెంటులోకి ప్రవేశించిన ప్రధాని మోదీ.. స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితమిచ్చారు. పార్లమెంట్ మొదటిదశ ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అత్యాధునిక హంగులతో నిర్మించిన నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రధాన ద్వారం నుంచి పార్లమెంటులోకి ప్రవేశించిన ప్రధాని మోదీ.. స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితమిచ్చారు. పార్లమెంట్ మొదటిదశ ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక్‌ససభలో సెంగోల్‌ను ప్రతిష్ఠించారు. ఆ తర్వాత పార్లమెంటు భవన నిర్మాణ కార్మికులను సత్కరించి.. వారికి జ్ఞాపికలు అందజేశారు. ఇక రెండోదశ ప్రారంభోత్సవంలో ప్రత్యేక స్మారక పోస్టల్ స్టాంప్‌ను, అలాగే రూ.72 నాణేన్ని విడుదల చేశారు. ఈ నాణెం బరువు 35 గ్రాములు. దీన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ మిశ్రమంతో తయారుచేశారు. ఇది 44 మిల్లీమీటర్ల వ్యాసంతో వృత్తాకారంలో ఉంటుంది.
ఈ రూ.75 నాణేంకు ఒకవేపు మధ్యలో అశోక స్థూపంపై ఉన్న సింహాలు కనిపిస్తాయి.ఈ జాతీయ చిహ్నానికి ఇరువైపుల దేవనాగరి లిపీలో భారత్ అని, ఇంగ్లీష్‌లో ఇండియా అని ఉంటుంది. దాని కింద సత్యమేవ జయతే అని రాసి ఉంది. దీని కింద రూపాయి గుర్తుతో నాణె విలువను సూచిస్తూ 75 సంఖ్యను ముద్రించారు. మరోవైపు పార్లమెంట్ భవనం ఉంటుంది. దాని ఎగువన దేవనాగరి లిపిలో ‘సన్‌సద్ సానుకూల్’ అని.. దిగువన ‘పార్లమెంట్ కాంప్లెక్స్’ అని ఆంగ్లంలో ముద్రించి ఉంటుంది. పార్లమెంట్ కాంప్లెక్స్ కింద 2023 అని రాసి ఉంటుంది. ఇంతకు ముందు కూడా ఈ రూ.75 నాణేన్ని విడుదల చేశారు. ఫడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ వజ్రోత్సవాలను పురస్కరించుకొని కేంద్రం ఈ నాణేన్ని రూపొందించింది. అయితే సాధారణ కరెన్సీ నోట్లు, నాణేల మాదిరిగా ఈ స్మారక నాణేలు వినియోగం కోసం జారీ చేసినవి కాదు. వీటిని వెండి తదితర లోహాలతో తయారు చేయడం వల్ల వీటి విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని కేవలం సేకరించడానికి తప్ప.. వినియోగానికి ఉపయోగించరు. మరోవైపు సాధారణ లోహంతో తయారు చేసిన స్మారక నాణేలు కొంతకాలం పాటు చలామణిలో ఉంటాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం