AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Senior Citizen Pension: అధికారుల మాయాజాలం! కాగితాల్లో చంపేశారు.. బతికున్నట్లు ధృవీకరణ పత్రం తెమ్మన్నారు

ప్రభుత్వం అందించే వృద్ధాప్య పింఛన్‌ కోసం ఓ పండు ముదుసలి ఆవేదన ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. అధికారుల నిర్లక్ష్యం మూలంగా బతికుండగానే చనిపోయినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. దీంతో 70 ఏళ్ల వయసులో తాను బతికే ఉన్నానని..

Senior Citizen Pension: అధికారుల మాయాజాలం! కాగితాల్లో చంపేశారు.. బతికున్నట్లు ధృవీకరణ పత్రం తెమ్మన్నారు
Senior Citizen Pension
Srilakshmi C
|

Updated on: May 28, 2023 | 3:51 PM

Share

ప్రభుత్వం అందించే వృద్ధాప్య పింఛన్‌ కోసం ఓ పండు ముదుసలి ఆవేదన ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. అధికారుల నిర్లక్ష్యం మూలంగా బతికుండగానే చనిపోయినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. దీంతో 70 ఏళ్ల వయసులో తాను బతికే ఉన్నానని ఎలా నిరూపించుకోవాలో తెలీక అవస్థలు పడుతున్నాడు. వివరాల్లోకెళ్తే..

ఝార్ఖండ్​ బొకారో జిల్లాలోని బాగ్దా గ్రామానికి చెందిన ఖేదాన్ ఘాన్సీ (70) గత కొన్నేళ్లుగా ప్రభుత్వ అందించే వృద్ధాప్య పింఛను అందుకుంటున్నాడు. గతేడాది సెప్టెంబర్​నుంచి అధికారులు పెన్షన్‌ నిలిపేశారు. దీంతో పింఛను ఎందుకు రావడం లేదో తెలియక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి ఖేదాన్ ఘాన్సీ ఆరా తీశాడు. అతడు మరణించినట్లుగా రికార్డుల్లో అధికారులు ఎక్కించినట్లు తెలిసింది. దీంతో ఏం చేయాలో పాలుపోక జిల్లా అధికారులకు మొరపెట్టుకున్నాడు. వేడుకున్నాడు ఖేదాన్ ఘాన్సీ. ‘సారూ.. నేను ఇంకా బతికే ఉన్న కదా.. చనిపోయానని రికార్డుల్లో అలా ఎలా రాసుకున్నారంటూ అమాయకంగా ప్రశ్నించాడు. వృద్ధుడి ప్రశ్నకు అధికారులు సమాధానం చెప్పకపోగా.. బతికే ఉన్నట్లుగా ధ్రువీకరణ పత్రం తీసుకురమ్మంటూ వృద్ధుడికి చెప్పారు. చనిపోతే డెత్​సర్టిఫికేట్ ఉంటుంది కానీ.. బతికున్నట్లు సర్టిఫికేట్ ఎక్కడ నుంచి తీసుకురావాలో అతనికి పాలుపోలేదు.

ఈ వంకతో గత 9 నెలలుగా పింఛను ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. దీంతో ప్రభుత్వాధికారులు కావాలనే తన పించన్‌ నిలిపివేశారని ఆరోపిస్తూ ఖేదాన్ ఘాన్సీ జిల్లా ఉన్నతాధికారి విజయ్‌కుమార్‌కు లేఖ రాశాడు. ‘బతికే ఉన్నా.. చనిపోయినట్లుగా రికార్డుల్లో ఎలా నమోదు చేస్తారు..? తక్షణమే అతడికి పింఛను తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోండి. 2022 సెప్టెంబర్​ నుంచి ఇప్పటివరకు ఆగిపోయిన మొత్తం పెన్షన్​ సొమ్మును చెల్లించండి’ అంటూ అధికారులను ఆదేశించాడు. బీడీఓ స్థాయి అధికారి స్వయంగా ఆదేశించినా అధికారులు ఇంతవరకూ ఆ వృద్ధుడికి పింఛన్‌ను పునరుద్ధరించకపోవడం కొసమెరుపు. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ప్రతి ఒక్కరూ దుమ్మెత్తిపోస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.