PM Modi: రానున్న రోజుల్లో ఎంపీ సీట్లు పెరుగుతాయి.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోదీ నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారయణసింగ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు ప్రధాని మోదీ తొలి ప్రసంగం చేశారు. ఇది కేవలం పార్లమెంట్ భవనం మాత్రమే కాదని.. 140 కోట్ల దేశ ప్రజలకు ప్రతీక అని ప్రధాని మోదీ అన్నారు. స్వాతంత్ర్య పోరాట ఆకాంక్షలను పూర్తి చేసేందుకు ఈ భవనం సాధనంగా ఉపయోగపడుతుందన్నారు.

PM Modi: రానున్న రోజుల్లో ఎంపీ సీట్లు పెరుగుతాయి.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
PM Modi
Follow us

|

Updated on: May 28, 2023 | 3:49 PM

దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోదీ నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారయణసింగ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు ప్రధాని మోదీ తొలి ప్రసంగం చేశారు. ఇది కేవలం పార్లమెంట్ భవనం మాత్రమే కాదని.. 140 కోట్ల దేశ ప్రజలకు ప్రతీక అని ప్రధాని మోదీ అన్నారు. స్వాతంత్ర్య పోరాట ఆకాంక్షలను పూర్తి చేసేందుకు ఈ భవనం సాధనంగా ఉపయోగపడుతుందన్నారు. ఆధునిక భారత్‌కు కొత్త పార్లమెంట్ అద్దం పడుతోందని పేర్కొన్నారు. ఇక్కడ జరిగే నిర్ణయాలు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని.. పీడిత వర్గాలకు పార్లమెంట్‌ ద్వారా న్యాయం జరగాలని.. ఇక్కడ చేసే చట్టాలతో దేశం మరింత పురోభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు.

మరోవైపు పాత పార్లమెంట్ భవనంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యేవని.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని పార్లమెంట్ భవనాన్ని నిర్మించామని తెలిపారు. అలాగే రానున్న రోజుల్లో ఎంపీల సంఖ్య పెరగనుందని వెల్లడించారు. లోక్‌సభలో సీట్లు పెరిగితే మరింత ఎక్కువ మంది ఎంపీలు కూర్చొవడానికి వెసులుబాటు ఉంటుందని తెలిపారు. ఆధునిక సాంకేతికతో పార్లమెంట్ భవనాన్ని నిర్మించామని .. కొత్త భవనాన్ని చూసి ప్రతీ భారతీయుడు గర్వపడుతున్నాడని అన్నారు. భారతదేశ వృద్ధి, ప్రపంచ వృద్ధికి ప్రేరణగా నిలుస్తుందని ఉద్ఘాటించారు. అయితే లోక్‌సభలో ప్రస్తుతమున్న 543 స్థానాలను 1000కి పెంచే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. మరి ఎన్ని ఎంపీ సీట్లు పెంచుతారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం