Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకింగ్ ఘటన.. బిడ్డకు జన్మనిచ్చిన 12 ఏళ్ల బాలిక!

పన్నెండేళ్ల బాలిక శుక్రవారం ఉదయం ఓ ఆసుపత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ షాకింగ్‌ ఘటన పంజాబ్‌లోని అమృత్‌సర్‌ జిల్లా అమృత్‌సర్‌ జిల్లా ఫగ్వారా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

షాకింగ్ ఘటన.. బిడ్డకు జన్మనిచ్చిన 12 ఏళ్ల బాలిక!
12 Year Old Delivers Child
Follow us
Srilakshmi C

|

Updated on: May 28, 2023 | 4:24 PM

పన్నెండేళ్ల బాలిక శుక్రవారం ఉదయం ఓ ఆసుపత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ షాకింగ్‌ ఘటన పంజాబ్‌లోని అమృత్‌సర్‌ జిల్లా అమృత్‌సర్‌ జిల్లా ఫగ్వారా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

తీవ్ర కడుపునొప్పి కారణంగా గురునానక్‌ దేవ్‌ ఆసుపత్రికి శుక్రవారం ఉదయం ఓ బాలిక వచ్చింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు బాలిక గర్భవతి అని నిర్థారించారు. అనంతరం ప్రసవం చేసి, 800 గ్రాముల బరువున్న మగ శశువు జన్మించింది. నెలలు నిండకుండానే ప్రసవం జరిగిందనీ.. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనంతరం వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. దీనిపై బాలిక తండ్రిని ప్రశ్నించగా.. గత ఏడు నెలలుగా తన కుమార్తె కడుపునొప్పితో బాధపడుతుందని బాలిక తండ్రి తెలిపాడు. కడుపు నొప్పి వచ్చిన ప్రతిసారీ మందులు తెచ్చి ఇచ్చేవాడినన్నాడు. ఇంట్లో తామిద్దరమే ఉంటామని, తన భార్య ఇల్లు విడిచి వెళ్లిపోయిందన్నాడు. ఐతే తన కూతురు గర్భవతని తనకు తెలియని తెలిపాడు.

ఈ క్రమంలో బాధితురాలిని ప్రశ్నించగా.. ఏడు నెలల కిందట బహిర్భూమికి వెళ్లినపుడు తనపై అత్యాచారం జరిగిందని తెలిపింది. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని నిందితుడు బెదిరించినట్లు తెల్పింది. నిందితుడి పేరు తెలియదని, ముఖం చూస్తే గుర్తుపట్టగలనని తెల్పింది. నిందితుడిని త్వరలోనే అరెస్ట్‌ చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని కపుర్తలా సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ రాజ్‌పాల్‌ సింగ్‌ సంధు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.