AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar: ఆధార్ కార్డ్ పోయిందా? నెంబర్ గుర్తులేదా? టెన్షన్ వొద్దు.. ఇలా కొత్తది తీసుకోండి..

మీ ఆధార్ కార్డ్ పోయిందా? నెంబర్ గుర్తుకు లేదా? పోనీ, ఆధార్ ఎన్‌రోల్ నెంబర్ కూడా లేదా? ప్రభుత్వ పథకాలు, ఇతర పనులకు కార్డు లేదని చింతిస్తున్నారా? మరేం పర్వాలేదు. అస్సలు టెన్షనే వద్దు. పోయిన కార్డును సులువుగా తీసుకునే మార్గం ఉంది. వాస్తవానికి భారతదేశ పౌరులకు ఆధార్ కార్డ్ కీలకమైన డాక్యూమెంట్.

Aadhaar: ఆధార్ కార్డ్ పోయిందా? నెంబర్ గుర్తులేదా? టెన్షన్ వొద్దు.. ఇలా కొత్తది తీసుకోండి..
Aadhaar
Shiva Prajapati
|

Updated on: May 28, 2023 | 8:01 PM

Share

మీ ఆధార్ కార్డ్ పోయిందా? నెంబర్ గుర్తుకు లేదా? పోనీ, ఆధార్ ఎన్‌రోల్ నెంబర్ కూడా లేదా? ప్రభుత్వ పథకాలు, ఇతర పనులకు కార్డు లేదని చింతిస్తున్నారా? మరేం పర్వాలేదు. అస్సలు టెన్షనే వద్దు. పోయిన కార్డును సులువుగా తీసుకునే మార్గం ఉంది. వాస్తవానికి భారతదేశ పౌరులకు ఆధార్ కార్డ్ కీలకమైన డాక్యూమెంట్. బ్యాంకు ఖాతా, పాన్‌కార్డు, రేషన్‌కార్డు తదితర వాటితో అనుసంధానం చేయడం తప్పనిసరి చేశారు. ఆధార్ కార్డు లేకపోతే ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోలేరు. ఆధార్ కార్డ్ లేకుండా, ముఖ్యమైన పని ఏదీ జరుగదు.

ఇలాంటి పరిస్థితిలో ఆధార్ కార్డ్ పోతే? దాని నంబర్‌ కూడా గుర్తులేకపోతే? సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే, దీనికి గురించి ఇక చింతించాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డ్ పోయినా? నెంబర్ మర్చిపోయినా? ఈజీగా మీ ఆధార్‌ కార్డును తిరిగి పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆధార్ కార్డ్ పోతే ఏం చేయాలి?

మీ ఆధార్ కార్డ్ పోయినట్లయితే, UIDAI దాన్ని మళ్లీ పొందే సదుపాయాన్ని కల్పిస్తుంది. ఇందుకోసం సర్వీస్ పోర్టల్‌కు వెళ్లి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. ఇక్కడ నుండి ఆధార్ నంబర్, ఆధార్ రెండవ కాపీని కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆధార్ నంబర్ ఎలా పొందాలి?

ఆధార్ కార్డును క్రియేట్ చేసే సమయంలో సంబంధిత వ్యక్తి మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి ని కూడా యాడ్ చేస్తారు. ఒక వేళ మీ ఆధార్ కార్డ్ పోయినట్లయితే.. ఆధార్ కార్డ్‌తో నమోదు చేయబడిన మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడిని ఉపయోగిస్తే, పోయిన ఆధార్ నంబర్‌ను తిరిగి పొందవచ్చు. ఇందుకోసం కొంత ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆధార్ నంబర్ పొందడానికి స్టెప్ టు స్టెప్ డీటెయిల్స్..

1. ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.

2. ఇప్పుడు మీరు ఆధార్ నంబర్ లేదా ఎన్‌రోల్‌మెంట్ నంబర్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

3. ఆ తర్వాత, మీ పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్ ID గురించిన సమాచారాన్ని ఇవ్వాలి.

4. ఇప్పుడు Send OTPపై క్లిక్ చేసి, మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయండి.

5. లాగిన్ అయిన తర్వాత, మీ ఆధార్ నంబర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపబడుతుంది.

6. ఇప్పుడు మీరు ఆధార్ నంబర్ సహాయంతో ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
5వ మ్యాచ్‌లో ఓడిన భారత్.. 3-2తేడాతో సిరీస్ గెలిచిన శ్రేయాస్ సేన
5వ మ్యాచ్‌లో ఓడిన భారత్.. 3-2తేడాతో సిరీస్ గెలిచిన శ్రేయాస్ సేన
బ్యాలెట్ పేపర్లలో కనిపించని సైకిల్, కమలం గుర్తు..!
బ్యాలెట్ పేపర్లలో కనిపించని సైకిల్, కమలం గుర్తు..!
ఇంట్లోని డీప్ క్లీనింగ్‌లో లైట్ బల్బులను ఎలా శుభ్రం చేయాలి? ఈజీగా
ఇంట్లోని డీప్ క్లీనింగ్‌లో లైట్ బల్బులను ఎలా శుభ్రం చేయాలి? ఈజీగా
తొలి బుల్లెట్‌ రైలు.. తొలిసారి అరుదైన దృశ్యాలు షేర్ చేసిన మంత్రి
తొలి బుల్లెట్‌ రైలు.. తొలిసారి అరుదైన దృశ్యాలు షేర్ చేసిన మంత్రి
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయని మాజీ సీఎం జగన్
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయని మాజీ సీఎం జగన్
ఏపీకి మరో ముప్పు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ఏపీకి మరో ముప్పు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ఓటీటీలో మరో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో మరో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
అమెరికా కళ్లుగప్పి రహస్య నెట్‌వర్క్ నుంచి ఆయుధాలు కొంటున్న ఇరాన్
అమెరికా కళ్లుగప్పి రహస్య నెట్‌వర్క్ నుంచి ఆయుధాలు కొంటున్న ఇరాన్
తీరానికి అకస్మాత్తుగా అరుదైన తాబేళ్లు...160కి. మీ మేర లాక్‌డౌన్!
తీరానికి అకస్మాత్తుగా అరుదైన తాబేళ్లు...160కి. మీ మేర లాక్‌డౌన్!
10 రోజుల్లో బంగారం, వెండి ఎంత తగ్గిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
10 రోజుల్లో బంగారం, వెండి ఎంత తగ్గిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!