Watch Video: బాబోయ్ ఇదేమైనా దెయ్యం చెట్టా? పైకేమో పచ్చని ఆకులు.. లోపల భగ భగ మంటలు.. !

సాధారణంగా చెట్టుకు మంటలు అంటుకుంటే.. చెట్టంతా చనిపోతుంది. ఆకులు కాలి బూడిద అయిపోతాయి. కొన్ని సందర్భాల్లో పిడుగు పడినప్పుడు కొబ్బరి, తాటి వంటి చెట్ల పై భాగం మంటల్లో కాలిపోతుంది. అలా చెట్టు మొత్తం చనిపోతుంది. కానీ, ఈ చెట్టు బహువిచిత్రంగా ఉంది.

Watch Video: బాబోయ్ ఇదేమైనా దెయ్యం చెట్టా? పైకేమో పచ్చని ఆకులు.. లోపల భగ భగ మంటలు.. !
Devil Tree
Follow us
Shiva Prajapati

|

Updated on: May 28, 2023 | 8:24 PM

సాధారణంగా చెట్టుకు మంటలు అంటుకుంటే.. చెట్టంతా చనిపోతుంది. ఆకులు కాలి బూడిద అయిపోతాయి. కొన్ని సందర్భాల్లో పిడుగు పడినప్పుడు కొబ్బరి, తాటి వంటి చెట్ల పై భాగం మంటల్లో కాలిపోతుంది. అలా చెట్టు మొత్తం చనిపోతుంది. కానీ, ఈ చెట్టు బహువిచిత్రంగా ఉంది. పైకి పచ్చని ఆకులతో నిగనిగలాడుతూ.. చెట్టు మానులో ఉన్న తొర్రలో మాత్రం భగ భగ మంటలు వస్తున్నాయి. అగ్ని జ్వాలలు ఎర్రగా రగులుతుండగా.. పైన పచ్చని ఆకులు కనువిందు చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది.

ఈ వైరల్ వీడియోలో ఓ నిర్మానుష్య ప్రాంతంలో భారీ చెట్టు ఉంది. చెట్టు నిండా పచ్చిన ఆకులు, పొడవాటి కొమ్మలు చూసేందుకు అందంగా ఉంది. అయితే, చెట్టు మానులో ఏర్పడిన భారీ తొర్రలో మాత్రం భయానకంగా మంటలు చెలరేగుతున్నాయి. ఎర్రగా, భగ భగ మండుతూ.. అగ్ని కీలలు చెట్టు తొర్రలో ఎగసి పడుతున్నాయి. ఈ విచిత్ర పరిస్థితిని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ప్రకృతి విచిత్రాన్ని చూసి షాక్ అవుతున్నారు. దీనిపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం.. ఈ వీడియోను మీరూ చూసేయండి.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియో ఇదే..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..