IPL 2023 Final Weather and Toss Update: ఆగని వర్షం.. విజేతను ఎలా నిర్ణయిస్తారు? రిజర్వ్ డేలో ఎలాంటి రూల్స్ ఉన్నాయంటే?
IPL 2023 Final Weather: అహ్మదాబాద్‌లో ఫైనల్ ప్రారంభానికి ఒక గంట ముందు, అకస్మాత్తుగా భారీ వర్షం ప్రారంభమైంది. దీని కారణంగా మ్యాచ్ నిర్ణీత సమయానికి ప్రారంభం కాలేదు.

ఐపీఎల్ 2023 ఫైనల్‌కు వర్షం అడ్డంకిగా మారుతోంది. అహ్మదాబాద్‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్‌కు ముందు వర్షం కారణంగా ఫైనల్‌పై టెన్షన్ పట్టుకుంది. ఫైనల్‌కు ముందు ఆ భయం నిజమైంది. ఆదివారం, మే 28, చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కు గంట ముందు వర్షం ప్రారంభమైంది. దీని కారణంగా మ్యాచ్ సమయానికి ప్రారంభం కాలేదు. కొద్దిగా గ్యాప్ ఇచ్చి, మరోసారి అంటే 8.30గంటలకు కూడా భారీగా వర్షం పడుతోంది. దీంతో ఇక ఏం జరుగుతుందా లేదా అనే ప్రశ్నలు అందరిలోనూ నెలకొంది.
అహ్మదాబాద్‌లో అంచనాల ప్రకారం, సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీని కారణంగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కాలేదు. ఇక్కడ వర్షం ఆగి మ్యాచ్ ఎప్పుడు మొదలవుతుందా అని అందరూ ఎదురుచూస్తుండగా ఒక్కసారిగా ఫైనల్‌కు రిజర్వ్‌డే నిబంధన లేకపోవడంతో గందరగోళం నెలకొంది. ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీలో ఫైనల్‌కు రిజర్వ్ డే లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది.




మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
ఫైనల్‌కు రిజర్వ్ డే నిబంధన ఉంది. ఇది సోమవారం, మే 29న నిర్వహించనున్నారు. ఫైనల్ ఆడే పరిస్థితుల ప్రకారం వర్షం కారణంగా సమయానికి మ్యాచ్ ప్రారంభం కాకపోతే అంటే ఈరోజు రాత్రి 9.35 గంటల వరకు మ్యాచ్ ప్రారంభమైతే ఒక్క ఓవర్ కూడా నష్టపోయే పరిస్థితి ఉండదు. అంటే 20-20 ఓవర్ల మ్యాచ్ ఉంటుంది.
? Update
It’s raining ?️ in Ahmedabad & the TOSS has been delayed!
Stay Tuned for more updates.
Follow the match ▶️ https://t.co/IUkeFQS4Il#TATAIPL | #Final | #CSKvGT pic.twitter.com/eGuqO05EGr
— IndianPremierLeague (@IPL) May 28, 2023
ఇది జరగకపోతే, 5-5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించే ప్రయత్నం చేస్తారు. ఇందుకోసం తెల్లవారజామున 12.06 గంటలలోపు గ్రౌండ్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి. అలా జరగకపోతే సోమవారం రిజర్వ్ డే రోజు మ్యాచ్ నిర్వహిస్తారు. రిజర్వ్ డేలో కూడా అదే నిబంధనలు అమలు చేయనున్నారు. 5-5 ఓవర్లు కూడా సాధ్యం కాకపోతే సూపర్ ఓవర్ నుంచి మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయిస్తారు.
ఒకవేళ రిజర్వ్ రోజు కూడా మ్యాచ్ జరగకపోతే..
ఇది కూడా జరగకపోతే ఏమవుతుంది అనేది ప్రశ్న కూడా ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి పరిస్థితి స్పష్టంగా లేదు. గత ఐపీఎల్ సీజన్ ఆట పరిస్థితుల ప్రకారం , రిజర్వ్ డే రోజు కూడా మ్యాచ్ జరగకపోతే, పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన జట్టు మాత్రమే విజేతగా ప్రకటిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సీజన్‌లోనూ అమలు చేసే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలవనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..