Success Story: చదివింది ఇంజనీర్.. చేస్తోంది వ్యవసాయం.. ఎర్ర అరటి సాగుతో లక్షల్లో సంపాదన..

గత కొంతకాలంగా మహారాష్ట్రలో కూడా రైతులు ప్రత్యేకమైన అరటిని పండిస్తున్నారు. ముఖ్యంగా చదువుకున్న యువకులు కూడా వ్యవసాయం వైపు.. ముఖ్యంగా అరటి సాగు వైపు దృష్టి సారిస్తున్నారు. యువకులు వ్యవసాయ రంగంలోకి ప్రవేశించడంతో వ్యవసాయం ఇప్పుడు ఆధునికంగా మారింది. సంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న రైతులు కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అరటి సాగు చేస్తున్నారు.

Success Story: చదివింది ఇంజనీర్.. చేస్తోంది వ్యవసాయం.. ఎర్ర అరటి సాగుతో లక్షల్లో సంపాదన..
Red Banana Farming
Follow us
Surya Kala

|

Updated on: Jun 25, 2023 | 11:15 AM

ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే పండు అరటిపండు. దీనిని అందరూ ఇష్టపడతారు. ఏడాది పొడవున  మార్కెట్‌లో లభించే పండు ఇది. మన దేశంలో దాదాపు  ప్రతి ప్రాంతంలో సాగు అరటిని సాగు చేస్తున్నారు. అయితే అరటిని అత్యధికంగా సాగు చేసే రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. దేశంలో పండే అరటిపండ్లలో దాదాపు 17.9 శాతం ఏపీలో ఉత్పత్తి అవుతున్నాయి. అయితే గత కొంతకాలంగా మహారాష్ట్రలో కూడా రైతులు ప్రత్యేకమైన అరటిని పండిస్తున్నారు. ముఖ్యంగా చదువుకున్న యువకులు కూడా వ్యవసాయం వైపు.. ముఖ్యంగా అరటి సాగు వైపు దృష్టి సారిస్తున్నారు. యువకులు వ్యవసాయ రంగంలోకి ప్రవేశించడంతో వ్యవసాయం ఇప్పుడు ఆధునికంగా మారింది. సంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న రైతులు కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అరటి సాగు చేస్తున్నారు. ఇంజనీరింగ్ చదివిన ఓ యువకుడు అరటి వ్యవసాయం చేస్తున్నాడు. లక్షల్లో సంపాదిస్తున్న యువ ఇంజనీరింగ్ గురించి ఈ రోజు తెలుసుకుందాం..

కిసాన్ తక్ ప్రకారం.. యువ రైతు పేరు అభిజిత్ పాటిల్.  మహారాష్ట్రలోని షోలాపురా జిల్లా కర్మలాలోని వాషింబే గ్రామ నివాసి. కిసాన్ పాటిల్ సివిల్ ఇంజినీరింగ్ చదివాడు. అయితే పాటిల్ ఉద్యోగం చేయకుండా  వ్యవసాయాన్ని ఎంచుకున్నాడు. అరటి సాగు లో లాభాలు ఉంటాయని భావించిన పాటిల్ భిన్నంగా ఎర్ర అరటి సాగుని చేస్తున్నాడు. ఇప్పుడు ఎర్ర అరటి సాగుతో పాటిల్ ఏడాదిలో లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నాడు. మొదట్లో సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేసేవాడినని.. అయితే అప్పుడు అంతగా ఆదాయం రాలేదని అభిజీత్ పాటిల్ చెప్పాడు. దీంతో ఎర్ర అరటి సాగునీ ఎంచుకుని శాస్త్రీయ పద్ధతిలో  ప్రారంభించాడు.

2015లో అరటి సాగు ప్రారంభం..

ఇవి కూడా చదవండి

పాటిల్ 2015 నుంచి అరటి సాగు చేస్తున్నాడు. ఇప్పుడు సుమారు నాలుగు ఎకరాల భూమిలో ఎర్ర అరటి సాగు చేస్తున్నాడు. మంచి ఆదాయం వస్తోంది. ఎర్ర అరటి సాగుతో ఇప్పటి వరకు రూ.35 లక్షల ఆదాయం వచ్చినట్లు పాటిల్ తెలిపారు. తన తోటలో అరటి పంట చేతికి అందడానికి ఒక సంవత్సరం పడుతుందని చెప్పాడు. అయితే ఒక ఎకరంలో అరటి సాగుకు రూ.లక్ష ఖర్చవుతుంది. ఇలా ఏడాది పొడవునా రూ.4 లక్షలు వెచ్చించి అరటి సాగుచేస్తున్నాడు. అయితే పెట్టుబడి కంటే అనేక రేట్లు లాభాలను పొందుతున్నాడు.

ఏడాదిలో 60 టన్నుల అరటి పంట దిగుబడి 

ఆకుపచ్చ, పసుపు అరటి కంటే ఎర్ర అరటిలో ఎక్కువ విటమిన్లు మరియు పోషకాలు ఉన్నాయి. అందుకే మార్కెట్‌లో ఎర్రటి అరటిపండుకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. దీని ధర కూడా సాధారణ అరటిపండ్ల కంటే ఎక్కువ. ప్రస్తుతం మార్కెట్‌లో దీని ధర డజను సుమారు రూ. 200 ఉండగా, పచ్చి, పసుపు అరటిపళ్లు డజను రూ.40 నుంచి రూ. 60కి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం పాటిల్ 4 ఎకరాల్లో సాగు చేస్తూ ఏటా 60 టన్నుల అరటి పండిస్తున్నాడు. పాటిల్ పండించిన అరటిని ఫైవ్ స్టార్ హోటళ్లకు కూడా సరఫరా చేస్తున్నాడు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..