Mysterious Cave: మనదేశంలో ఈ గుహ రహస్యాలకు నెలవు.. బయటకు వచ్చే దారి తెలియని మిస్టరీ..

ముంగేర్ నగరంలోని శ్రీ కృష్ణ వాటికా లోపల ఉన్న 'మీర్ కాసిం' గుహ వింతలకు నెలవు. ఈ గుహ హాస్యమయి గుఫా పేరుతో ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. 250 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గుహకు మరో చివరను ఇప్పటి వరకు ఎవరూ కనుగొనలేకపోయారు.

Mysterious Cave: మనదేశంలో ఈ గుహ రహస్యాలకు నెలవు.. బయటకు వచ్చే దారి తెలియని మిస్టరీ..
Mysterious Cave
Follow us
Surya Kala

|

Updated on: Jun 18, 2023 | 11:43 AM

ఆధునిక విజ్ఞానంతో మనిషి అంబరాన్ని అందుకుంటున్నాడు. సముద్రం లోతులను కొలుస్తున్నాడు. అయినప్పటికీ ప్రపంచంలో మానవ మేధస్సుకు సవాల్ కు విసిరే అనేక వింతలు, విశేషాలున్నాయి. అవును  ప్రపంచంలో చాలా మర్మమైన ప్రదేశాలు ఉన్నాయి. వీటి గురించి తెలుసుకున్నవారు ఆశ్చర్యపోతారు.  అంతేకాదు వీటి రహస్యాన్ని ఛేదించాలని చాలామంది ప్రయత్నించి విఫలం అయినవారున్నారు. కొన్ని మిస్టరీలను క్రాలక్రమంలో చేధించగా.. కొన్ని ప్రాంతాల్లోని మిస్టరీలు ఇప్పటికీ శాస్త్రజ్ఞులకు సవాల్ ను విసురుతూనే ఉన్నాయి. ప్రశ్నర్ధకంగా మిగిలిపోతున్నాయి.  అలాంటి రహస్య ప్రదేశం మన దేశంలోని బీహార్ రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న ఓ గుహ వింతలకు నిలయం.. ఈ గుహ లోపలికి వెళ్లడానికి మార్గం ఉంది.. అయితే ఈ గుహ చివర మాత్రం ఇప్పటికీ కనుగొనలేకపోయారు. నేటికీ ఈ గుహకు మరొక చివర కనిపించలేదు. ఈ రోజు ఆది ఉంది.. అంతం తెలియని మిస్టరీ గుహ గురించి తెలుసుకుందాం..

ముంగేర్ నగరంలోని శ్రీ కృష్ణ వాటికా లోపల ఉన్న ‘మీర్ కాసిం’ గుహ వింతలకు నెలవు. ఈ గుహ హాస్యమయి గుఫా పేరుతో ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. 250 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గుహకు మరో చివరను ఇప్పటి వరకు ఎవరూ కనుగొనలేకపోయారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం.. ఈ గుహ క్రీ.శ.1760లో నిర్మించారు. అప్పట్లో రాజులకు ప్రజలకు ఏ సమస్య వచ్చినా సురక్షితంగా ఉండడం కోసం ఈ గుహను ఆశ్రయించేవారు.  ఇప్పటికీ ఈ గుహ చివర ఎక్కడ ఉందో తెలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అనేక రకాల ఊహాగానాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఈ గుహకు సంబంధించిన రహస్యం ఏమిటో ఎవరికీ తెలియలేదు.

ముంగేర్‌ను కాపాడేందుకు.. 

ఇవి కూడా చదవండి

సమర్ధుడైన పాలకుడైన మీర్ ఖాసిం రాజ్య పాలన చేసే సమయంలో బెంగాల్ రాజధానిని ముర్షిదాబాద్ నుండి ముంగేర్‌కు మార్చాడని చెబుతారు. మీర్ ఖాసిం 1764 వరకు ముంగేర్‌లో ఉన్నాడు. అప్పుడు ఈ నగరాన్ని సురక్షితంగా ఉంచాలని భావించి నగరాన్ని కోటగా మార్చాడు. అందరూ ఈ గుహలో సురక్షితంగా ఉండలని భావించాడు. అయితే ఈ గుహలోపలి వెళ్ళడానికి దారి కనిపిస్తుంది కానీ.. రెండో చివర ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీర్ కొండకు సమీపంలో ఉందని చెబుతారు. అయితే ఈ గుహ అంతం గురించి ఇప్పటి వరకు ఊహాగానాలు మాత్రమే వినిపిస్తూ వస్తున్నాయి. స్వతంత్ర హోదాను కొనసాగించి బ్రిటిష్ పాలకుల కోపానికి గురయ్యాడు. మీర్ ఖాసిం చివరికి బ్రిటిష్ దళాల చేతిలో ఓడిపోయి మే 8, 1777న మరణించాడు.

ఇక్కడ నివసిస్తున్న స్థానికుల పెద్దల ప్రకారం.. మీర్ ఖాసిం కుమారుడు ప్రిన్స్ బహర్ , కుమార్తె ప్రిన్సెస్ గుల్ సమాధి కూడా ఈ పార్కులోనే ఉంది.  బ్రిటిష్ వారు దాడి చేసిన సమయంలో దంపతులు ఇద్దరూ ఈ గుహలో దాక్కున్నారని చెబుతారు. ఇంతలో ఆంగ్ల సైనికులు వారిని చంపారు. ఆ తర్వాత వారి సమాధులను ఈ పార్కులో నిర్మించారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..